ఆర్ధిక శక్తి మరియు మానవ జాతికి మరియు ఖగోళానికి ముఖ్యమైన లఘు కథనాత్మకాలను రూపుదిద్దడం రెంటిలోనూ యువ ఆర్ధిక వ్యవస్థలు ప్రముఖ పాత్ర వహిస్తున్న నేపథ్యం లో ప్రపంచపు శక్తి మరియు ప్రాబల్యాల అక్షం సున్నితంగా మారుతున్నది. పాశ్చాత్త్య దేశాలు ఆకారం మరియు ఒప్పొందాలు రూపొందించగా మిగతా ప్రపంచదేశాలు వాటిని అనుసరించే కాలం చెల్లింది.
నేడు ఉద్భవిస్తున్న ఆర్ధిక వ్యవస్థలు తమ సొంత గళం వినిపిస్తున్నాయి, అందులో మన దేశపు గళం అత్యంత శక్తివంతమైన గళం. భౌగోళిక రాజకీయ సుస్థిరత, ఏకీభవన శక్తి మరియు అంతర్గ్రహ అంతరిక్ష యానం, మహిళలను నాయకత్వస్థాయికి చేర్చడం, దారిద్రియ నిర్మూలనం, ఆరోగ్య సేవల అందుబాటు, పరిరక్షణ, పర్యావరణ చర్యలు మరియు నిర్వహణీయత వంటి అన్ని రంగాలలో ప్రపంచ లక్ష్యాల సాధన లో భారతదేశపు పాత్ర కీలకం.
2015 లో జరిగిన సంయుక్త దేశాల నిర్వహణీయ అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు :"మానవాళిలో ఆరవ భాగం ప్రజల నిర్వహణీయ అభివృద్ధి ప్రపంచానికి మరియు మన అందమైన గ్రహానికి చాలా కీలకం. తక్కువ సవాళ్లు మరియు అధిక ఆశాభావం కలిగిన ప్రపంచం అది." ఆ క్షణం లో ప్రపంచం లోని భారతీయులందరూ ఉన్నతంగా అగుపించారు.
సత్వర చర్యలు ఈ పలుకలకు ఊతం ఇచ్చాయి. UN Sustainable Development Goals (SDGs), SDGs కు సంబంధించిన ప్రణాళికల మానచిత్రణ మరియు వాటి లక్ష్యాలు, మరియు ప్రతి లక్ష్యానికి నాయక మరియు సహాయక మంత్రిత్వ శాఖల గుర్తింపు వంటి కార్య నిర్వహణ భారతదేశపు ఆలోచనాశయం అయిన NITI ఆయోగ్ కు అప్పగించబడినది. మొత్తం ప్రణాళిక గురించి సమగ్ర అవగాహన కలిగిన కేంద్రీయ కర్తృత్వ సంస్థ అయిన NITI ఆయోగ్ ఒకేసారి వివిధ లక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నది.
ఈ విభాగాలలో స్వచ్ఛ ఇంధనం లో భారతదేశపు పెట్టుబడులు ఒకటి. ఈ ఒక్క విభాగం పైన దృష్టి సారించడం తో SDG 3 (మంచి ఆరోగ్యం మరియు స్వస్థత), SDG 6( పరిశుద్ధమైన నీరు మరియు పారిశుధ్యం), SDG 7 (చవకైన మరియు శుద్ధ ఇంధనం), SDG 11 (నిర్వహణీయ నగరాలు మరియు సమాజాలు), SDG 13 (పర్యావరణ సంరక్షణ) SDG 14 (జలాంతర జీవనం) మరియు SDG 15 భూ ఉపరితల జీవనాల వైపు కూడా భారతదేశం పురోభివృద్ధి సాధించగలుగుతున్నది.
భారతదేశం ప్రస్తుతం 55% విద్యుచ్ఛక్తి బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తున్నది. కానీ, సంభావ్య స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తి అధికంగా వున్న భారతదేశం అలా ఉండవలసిన అవసరం లేదు:
-భారతదేశపు సౌర ఇంధన సంభావ్యత సంవత్సరానికి గాను గణనీయంగా 5,000 ట్రిలియన్ kWh గా ఉంది.
- ఇటీవలి అంచనా దేశం లో భూ ఉపరితల స్థాయి కి 100 మీటర్ల పైన 302 GW మరియు 120 మీటర్ల పైన 695.50 GW స్థూల వాయు ఇంధన సంభావ్యత సూచిస్తున్నది.
- MNRE మద్దత్తు చేసిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, భారతదేశం సాలీనా 750 మిల్లియన్ మెట్రిక్ టన్నుల జీవద్రవ్యం తయారుచేస్తుంది. సుమారుగా సాలీనా 230 మిలియన్ మెట్రిక్ టన్నులకు గాను రమారమి 28 GW సంభావ్య ఇంధనం ఉత్పత్తి చెయ్యవచ్చును.
- దీనికి అదనంగా, దేశం లో ని 550 చెక్కర కర్మాగారాలు విద్యుత్ సంగ్రహానికి సాంకేతిముగా మరియు ఆర్థికంగా అభిలషణీయ సహ-ఉత్పత్తి విధానాలు అవలంబిస్తే ఆ చెక్కర కర్మాగారాల నుండి వెలువడే బాగేస్ సహ-ఉత్పత్తి ద్వారా 14 GW అదనపు విద్యుత్ ఉత్పత్తి చెయ్యవచ్చు.
ప్రతిష్ఠాపిత విద్యుత్ లో 40 % శిలాజేతర ఇంధన మూలాల నుండి లభించే భారతదేశం ఇప్పటికే ప్రపంచపు మూడవ అతి పెద్ద పునరుద్ధరణీయ ఇంధన శక్తి అన్న విషయం పెద్దగా తెలియదు. 2030 నాటికి తన ఇంధన అవసరాల లో 50 % పునరుద్ధరణీయ ఇంధనం ద్వారా పూర్తి చేసుకోవాలని మరియు తన పునరుద్ధరణీయ ఇంధన శక్తి సామర్థ్యం 500 GW కు వృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నది.
ఇది సాధించవచ్చు.
దీనిని సాధించుకోవడానికి అవసరమైన సహజ వనరులు మనవద్ద వున్నాయి: సౌర శక్తి , వాయువు, పుష్కలమైన వ్యాసాయం నుండి జనించే జీవద్రవ్యం. ఇప్పుడు మనకు కావలసిన సాధ్యకాలు: స్థిరమైన మూలధన పెట్టుబడి, నిపుణత గలిగిన మానవ వనరులు, మరియు దీర్ఘాయువు మరియు ఉన్నత ఆచరణలను నిర్మించే బలమైన నాణ్యతాధారా రూపం.
మన విజయానికి QCI మనలను సమాయత్తపరుస్తున్నది. 25 సంవత్సరాల క్రితం స్థాపించినప్పటి నుండి శిక్షణ, ప్రమాణీకరణ, గుర్తింపు మరియు మార్గదర్శకత ద్వారా QCI నాణ్యతా పర్యావరణ సృష్టి లో నిమగ్నమై వుంది. పంపిణీదారులు మరియు సేవాదారులు ఇరువురికి ఆధార రూపం మనుగడలో వున్నది: నైపుణ్యం కలిగిన మానవ వనరుల జట్టులో చేరగోరె వారికి మరియు వారికి ఉపాధి కల్పించగోరే వారికి కూడా.
బహు ముఖ ఉపగమనం ద్వారా QCI దీనిని సాధిస్తోంది. వారి మొదటి లక్ష్యం నైపుణ్య అభివృద్ధి. QCI పలు పీఠాల తో కూడుకుని వున్నది- The National Accreditation Board for Education and Training (NABET). సేవలు, విద్య (సాంప్రదాయక మరియు అసాంప్రదాయక), పరిశ్రమ, పర్యావరణం మొదలైనటువంటి రంగాలలో NABET నాణ్యత భరవసా కొరకు యంత్ర రచన ఏర్పాటు చేసినది. దీని అర్థం, విద్య మరియు శిక్షణ అందించే సేవాదారులు ప్రమాణాలు పాటించడమే కాకుండా వాటి ఫలితాలను నిరంతరం అభివృద్ధి పరచే దిశగా NABET తో కలిసి శ్రమిస్తున్నారు.
వివిధ రంగాలలో క్షమత పెంపుదల మరియు భారతదేశానికి ప్రపంచ అత్యుత్తమ పద్ధతులు కొనివచ్చె దిశగా QCI యొక్క Training And Capacity Building (TCB) విభాగం అంతర్జాతీయ సంస్థల తో కలిసి పనిచేస్తున్నది . తరగతి గదుల శిక్షణ, చాక్షుష శిక్షణ, వెబినార్స్, మరియు ఈ లెర్నింగ్ పద్ధతుల ద్వారా TCB శిక్షణ అందిస్తుంది మరియు అవసరాధారిత శిక్షణా పాఠ్యక్రమాల రూపకల్పన లో GOI, నియంత్రణాధి కారులు, విద్యా సంస్థలు మరియు పారిశ్రామిక సంఘాలకు చేయూత నిస్తుంది.
అంతేకాకుండా, హరిత ప్రమాణాల అవలంబన గురించిన GOI మార్గదర్శకాలు పరిశ్రమల దైనందిన కార్యావళి మరియు నూతన పరిణామాల లో చేరే విధంగా NABET యొక్క Environmental Impact Assessment (EIA) ప్రణాళిక సహాయపడుతుంది. EIA నివేదికలు తయారుచేసే సలహాదారులు అందరూ కూడా ఈ ప్రమాణాలనే పాటిస్తారు మరియు మొత్తం పారిశ్రామిక రంగ పర్యావరణ కు సంబంధించిన అనువర్తన వివరాలు సేకరిస్తారు.
NGOs నుండి భారీ పరిశ్రమల దాకా వుండే మొత్తం సేవాదారుల వర్ణమాల ను ఏక వాసి దిశగా సమీకృత పరచడం లో National Accreditation Board for Certification Bodies (NABCB) భ్రమణ ప్రాయంగా పనిచేస్తుంది. ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు సంఘం యావత్తూ తమ పెట్టుబడి పైన మెరుగైన రాబడులు అందుకునే విధంగా QCI యొక్క వాసి విధాన ప్రక్రియ పనిచేస్తుంది.
విశేషంగా స్వచ్ఛ ఇంధనం గురించి మాట్లాడినప్పుడు,Energy Management Systems, Environment Management Systems, and Quality Management Systems కు సంబంధించిన NABCB గుర్తింపులు గమనార్హం. ఈ నిర్దిష్ట గుర్తింపుల కదనముగా IT మరియు IT భద్రత నుండి వృత్తి సంబంధిత ఆరోగ్యం మరియు భద్రతల వంటి అన్ని సహాయ ధర్మాలకు వర్తించే ప్రమాణాలను NABCB పఠిష్ట పరుస్తుంది.
పలు పరిశ్రమలు, సేవా రంగాలు మరియు ఎగుమతి రంగాల లో వృద్ధి కి తోడ్పడుతున్న MSME పటిమ భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ను ఒక పఠిష్ట స్థితికి తీసుకుపోతున్నది. అయినప్పటికీ, ప్రపంచ స్థాయి విపణి లో సమర్థవంతంగా పోటీదారు గా నిలవాలంటే MSME కి చేయూత అవసరం. దాని సాధన కొరకు, MSME మంత్రిత్వ ఆధ్వర్యం లో Zero Effect Zero Defect (ZED) ప్రణాళిక రూపొందించబడినది. ఉన్నత వాసి, మరియు నిర్వహణియ మూలం నుంచి తీసుకున్న లేదా సృష్టించబడిన కారణంగా భారతీయ ఉత్పత్తులు ప్రపంచ విపణులకు అత్యంత ఆకర్షణీయమైనవి గా చేయడం లో ZED పనిచేస్తుంది.
ZED ప్రమాణీకరణ కొరకు నిర్వహణీయ పద్ధతులు ఆధారంగా MSME లు గణించబడతాయి కనుక వాటి ఇంధన మూలాలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. భారతదేశం లోని పలు రాష్ట్రాలలో వేసవి కాలం లో విద్యుత్ కోతలు అత్యధిక స్థాయి లో ఉంటాయి కనుక సౌర శక్తి వినియోగం MSME లకు కడు ఉపయుక్తంగా ఉంటుంది. తత్కారణంగా వాటి పోటీ పటిమకు, ముఖ్యముగా పాశ్చాత్త్య విపణులలో, ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది: స్వచ్ఛ ఇంధన మూలాల నిర్వహణీయత మరియు విశ్వసనీయ ఇంధన మూలాల ఆధారంగా వ్యాపార కొనసాగింపు.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ అవడం వలన దాని ఇంధన అవసరాలు తప్పకుండా పెరుగుతాయి. అంటే మనం భూగోళానికి మరియు ప్రజానీకానికి ఏది మంచిదో ఎంచుకోవాలని దీని అర్థమా? కాదు. స్పష్ఠంగా, మెరుగైన పధ్ధతి మరొకటి వున్నది. స్వచ్ఛ ఇంధనం లో మన పెట్టుబడులు మన ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇవ్వడమే కాకుండా తద్ద్వారా నూతన సాంకేతికతల లో మరిన్ని ఉద్యోగావకాశాలు , ప్రజా బాహుళ్యానికి మెరుగైన జీవన ప్రమాణాలు, మెరుగైన గాలి మరియు నీరు మరియు మెరుగైన భూ వినియోగత సిద్ధిస్తాయి.
2015 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మనకు యోగ్యమైన లక్ష్యాలు ఏర్పరచారు: అభివృద్ధి మరియు నిర్వహణీయత విభిన్నము కావు అని ప్రపంచానికి చూపడం. మన ఆర్ధిక వ్యవస్థ కుంటుపడకుండా ఈ లక్ష్యాలను కలిసికట్టుగా సాధించడం కోసం భారతదేశం తన పునరుద్ధరణీయ ఇంధన సంభావ్యత సాధించాల్సిన అవసరం వున్నది. అదృష్టవశాత్తూ, రాజకీయ సంకల్పం మరియు మన పునరుద్ధరణీయ ఇంధన కార్యావళి కి గుణవత్థా సే ఆత్మనిర్భరతా అందించే QCI పర్యావరణం మనుగడలో వున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Economy