ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఒక శుభవార్త. EPFO తాజాగా ఎలక్ట్రానిక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు ఇప్పుడు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానంలో ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు తమ కాంట్రాక్టర్ల ఈపీఎఫ్ కాంప్లయర్స్ సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓలో నమోదు చేయించుకున్న కొంతమంది యజమానులు కాంట్రాక్టర్ల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటారు. వీరు ఇప్పుడు EPFO పోర్టల్‌లో సులభంగా తమ కింద పనిచేసే కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను నమోదు చేయవచ్చు. కొత్త సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈపీఎఫ్ఓ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ కోసం ఈ సదుపాయాన్ని ప్రారంభించామని, వీరు ఇప్పుడు తమ కాంట్రాక్టర్ల EPF కాంప్లయన్స్ను సులభంగా చూసుకోవచ్చని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది.
Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా
EPF Withdrawal: పీఎఫ్ క్లెయిమ్‌కు అప్లై చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
ఈపీఎఫ్‌వో యూనిఫైడ్ వెబ్సైట్లో కొత్త సేవలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. https://unifiedportal-emp.epfindia.gov.in/epfo/ వెబ్సైట్ ఓపెన్ చేయగానే, మొదటి కాలమ్‌లో దీనికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. EPFOలో నమోదు కాని ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ కూడా సులభంగా యూనిఫైడ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకోవచ్చు. వీరు ముందు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం పోర్టల్‌లో లాగిన్ అయ్యి.. తమ కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లాగిన్ ఐడీ లేదా పాస్వర్డ్ మర్చిపోతే, ఈ వివరాలను రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెస్సేజ్ ద్వారా పొందవచ్చు. ఇందుకు వెబ్సైట్లో forgot password link లింక్‌పై క్లిక్ చేయాలి. కొన్నిసార్లు తప్పు పాస్‌వర్డ్‌ను ఎక్కువసార్లు ఎంటర్ చేయడం వల్ల అకౌంట్ లాక్ అవుతుంది. ఇలాంటప్పుడు ‘అన్ లాక్ అకౌంట్’ లింక్ ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు.
IDFC First Bank: యాన్యువల్ ఫీజ్ లేకుండా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
Credit Card Charges: మీ క్రెడిట్ కార్డుపై ఈ ఛార్జీలు ఉంటాయని మీకు తెలుసా?
పోర్టల్‌లో అన్ని వివరాలను యాడ్ చేసిన తరువాత.. ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ద్వారా కాంట్రాక్టర్లు ఉద్యోగులకు ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నారో చూడవచ్చు. ECR ద్వారా కాంట్రాక్టర్లు ఉద్యోగులకు ఈపీఎఫ్ కాంట్రిబూషన్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. కాంట్రాక్ట్ వర్కర్ల వివరాలన్నీ ఈపీఎఫ్‌వో నమోదు చేశారో లేదో కూడా ఆరా తీయవచ్చు. ECRను 2012లో అందుబాటులోకి తీసుకువచ్చారు. యజమానులు ఆన్లైన్ రిటర్నులు దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ దీన్ని ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance