EPFO: ఎన్నికల ముందు మరో వరం... ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు

EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

ఎన్నికల సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 0.1 శాతం పెరగడం ఉద్యోగులకు వరమే. ఈ వడ్డీ రేటు 2018-19 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు పెంచడం సుమారు 6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుందని అంచనా.

  • Share this:
    ఎన్నికల ముందు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి మరో వరం లభించింది. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెంచింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO). గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ఓ. అంతకుముందు పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.55 శాతం మాత్రమే. 2016 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఏఏ సంవత్సరంలో ఎంతెంత వడ్డీ ఉందో చార్ట్ చూడండి.

    EPF latest interest rate, EPFO minimum pension, EPS minimum pension, PF interest rate latest, minimum pension under EPS, pf balance checking, epfo employee login, epfo passbooks, ఈపీఎఫ్ వడ్డీ రేటు, ఈపీఎఫ్ఓ మినిమమ్ పెన్షన్, ఈపీఎస్ మినిమమ్ పెన్షన్, కనీస పెన్షన్, పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్, పీఎఫ్ బ్యాలెన్స్ కాల్, పీఎఫ్ బ్యాలెన్స్

    ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 0.1 శాతం పెరగడం ఉద్యోగులకు వరమే. ఈ వడ్డీ రేటు 2018-19 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు పెంచడం సుమారు 6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుందని అంచనా. గురువారం జరిగిన సమావేశంలో కనీస పెన్షన్ పెంచే అంశంపైనా చర్చ జరిగింది. నిర్ణయాన్ని తదుపరి బోర్డు సమావేశానికి వాయిదా వేశారు.

    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


    ఇవి కూడా చదవండి:

    PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

    Personal Finance: మీ బ్యాంక్ అకౌంట్ వాడట్లేదా? ఇలా క్లోజ్ చేసెయ్యండి

     
    First published: