EPFO Alert: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ అలర్ట్ మెసేజ్

ఉద్యోగాలు మారి పాత పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌లోకి మార్చాలనుకునే ఉద్యోగులనే మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ గుర్తించింది.

news18-telugu
Updated: October 28, 2019, 4:54 PM IST
EPFO Alert: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ అలర్ట్ మెసేజ్
EPFO Alert: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ అలర్ట్ మెసేజ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా? మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. మీకే కాదు... ఈపీఎఫ్ ఖాతాలున్న 6 కోట్ల మందికి ఇవే హెచ్చరికలు జారీ చేస్తోంది. మోసగాళ్లు ఫోన్ లేదా ఇమెయిల్ చేసి ఈపీఎఫ్ఓ అధికారులమని నమ్మించి మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ లేదా యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN, పాస్‌వర్డ్, ఓటీపీ లాంటి వివరాలన్నీ తెలుసుకొని మోసగిస్తారని హెచ్చరిస్తోంది. ఉద్యోగాలు మారి పాత పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్‌లోకి మార్చాలనుకునే ఉద్యోగులనే మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ గుర్తించింది. ఇప్పటికే కొందరు మోసపోయి డబ్బు పోగొట్టుకున్నట్టు ఫిర్యాదులు కూడా వచ్చాయి. అందుకే ట్విట్టర్‌తో పాటు ఇతర మాధ్యమాల్లో ఈపీఎఫ్ ఖాతాదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులెవరూ తమ వివరాలను ఫోన్‌లో లేదా ఇమెయిల్‌లో ఎవరికీ వెల్లడించొద్దని సూచిస్తోంది ఈపీఎఫ్ఓ.





ఈపీఎఫ్ఓ అధికారులు, సిబ్బంది ఎవరూ ఆధార్, పాన్ కార్డ్, యూఏఎన్ లేదా బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్‌లో అడగరన్న విషయాన్నిగుర్తుంచుకోవాలి. బ్యాంకులో లేదా ఈపీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ఈపీఎఫ్ఓ నుంచి ఎవరూ ఖాతాదారులకు ఫోన్ చేయరు. ఎవరైనా అలాంటి కాల్స్ లేదా ఇమెయిల్స్ చేసి వివరాలు అడుగుతున్నారంటే మోసగాళ్లేనని గ్రహించాలి. ఎట్టిపరిస్థితుల్లో మీ వివరాలు వెల్లడించొద్దు. పొరపాటున ఏవైనా వివరాలు వెల్లడిస్తే మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. మీకు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఈపీఎఫ్ఓ అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

November Holidays: బ్యాంకు పనులు ఉన్నాయా? నవంబర్‌లో సెలవుల వివరాలివే

Gold Sales: ఒక్క రోజులో 30,000 కిలోల బంగారం అమ్మకాలు... ధన్‌తేరస్ రోజున రికార్డ్

Post Box App: మీ ఫోన్‌కు మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ ఒక్క యాప్‌తో చెక్ పెట్టొచ్చు
First published: October 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>