హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా మోసపోవచ్చు జాగ్రత్త

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా మోసపోవచ్చు జాగ్రత్త

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా మోసపోవచ్చు జాగ్రత్త
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా మోసపోవచ్చు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)

EPF Claim Frauds | ఉద్యోగం మారిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి మోసాలపై ఈపీఎఫ్ఓ అధికారులకు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? మీ ఈపీఎఫ్ అకౌంట్‌ స్టేట్‌మెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారా? మోసగాళ్లు ఈ మధ్య ఈపీఎఫ్ ఖాతాదారుల్ని టార్గెట్ చేస్తున్నారు. వివరాలన్నీ తెలుసుకొని సులువుగా మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ఖాతాదారుల్ని అప్రమత్తం చేస్తోంది ఈపీఎఫ్ఓ. సైబర్ నేరగాళ్లు ఈపీఎఫ్ ఖాతాదారుల్ని చాలా సింపుల్‌గా ఛీట్ చేస్తున్నారు. ముందుగా ఖాతాదారులకు ఓ ఫోన్ కాల్ వస్తుంది. తాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అధికారులమని ఫోన్‌లోని వ్యక్తి పరిచయం చేసుకుంటారు. మీ వ్యక్తిగత వివరాలు వెరిఫై చేయాలని నమ్మిస్తారు. మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, చివరి ఎంప్లాయ్‌మెంట్ వివరాలు, యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN తెలుసుకుంటారు. అంతే... ఆ వివరాలతో అందులో సైబర్ నేరగాళ్ల బ్యాంకు అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసి క్లెయిమ్ చేసుకుంటారు. ఈ విధంగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌లోని డబ్బులు దోచుకుంటారు.

  సరిగ్గా ఇదే పద్ధతిలో ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు అనేక మంది మోసపోయారు. ఉద్యోగం మారిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి మోసాలపై ఈపీఎఫ్ఓ అధికారులకు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ మోసాలపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఎవరూ మీ ఆధార్, పాన్, యూఏఎన్ నెంబర్లను ఫోన్‌లో అడరగని, ఎవరైనా ఈపీఎఫ్ఓ అధికారి పేరుతో కాల్ చేస్తే నమ్మొద్దని, డబ్బులు డిపాజిట్ చేయమని అడిగితే పట్టించుకోవద్దని, ఫేక్ కాల్స్‌ని నమ్మి మోసపోవద్దని ఈపీఎఫ్ఓ హెచ్చరిస్తోంది. మీకు ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయాలి. లేదా దగ్గర్లోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాలి. ఎట్టిపరిస్థితుల్లో మీ వివరాలన్నీ ఇతరులకు చెప్పి మోసపోకూడదు.

  ఇవి కూడా చదవండి:

  Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా

  March Bank Holidays: మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ప్లాన్ చేసుకోండి ఇలా

  EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CYBER CRIME, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు