• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • EMPLOYEES PROVIDENT FUND ORGANISATION EPFO TO CREDIT 2020 21 INTEREST SOON KNOW HOW TO CALCULATE INTEREST ON YOUR EPF BALANCE SS

PF Interest: పీఎఫ్ వడ్డీని ఎలా లెక్కిస్తారో తెలుసా? ఫార్ములా ఇదే

PF Interest: పీఎఫ్ వడ్డీని ఎలా లెక్కిస్తారో తెలుసా? ఫార్ములా ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

EPF Interest | మీకు ఈపీఫ్ అకౌంట్ ఉందా? ప్రతీ ఏటా వడ్డీ జమ అవుతోందా? అసలు ఈపీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి.

  • Share this:
    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారు ప్రతీ ఏటా ఎంత వడ్డీ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ప్రతీ ఏటా వడ్డీని నిర్ణయిస్తుంది. ఆ వడ్డీని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో జమ చేస్తుంది. ఏడాదికి ఒకసారి ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ అవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీని ప్రకటించింది ఈపీఎఫ్ఓ. ఈ వడ్డీ ఇంకా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ కాలేదు. అయితే ఈఫీఎఫ్ వడ్డీని ఎలా లెక్కిస్తుంది? ఎంత జమ చేస్తుంది? అన్న సందేహలు ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఉంటాయి. అయితే ఈపీఎఫ్ వడ్డీ ఎంత వస్తుందో తెలియాలంటే ముందుగా మీ పీఎఫ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈపీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి.

    SBI Branch Change Online: ఎస్‍బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో వేరే బ్రాంచ్‌కు మార్చండి ఇలా

    Insurance Scheme: కరోనాతో చనిపోయినవారి నామినీకి రూ.2,00,000... స్కీమ్ వివరాలివే

    ఓ కంపెనీలో 20 కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ ఉద్యోగుల పేరు మీద ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. ప్రతీ నెలా ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తుంది. బేసిక్ వేతనంలో 12 శాతం వాటాను ఉద్యోగి జమ చేస్తే, 12 శాతం వాటాను యజమాని జమ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే యజమాని జమ చేస్తే 12 శాతం వాటాలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి, 3.67 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లోకి వెళ్తుంది. అంటే మొత్తం 24 శాతం ఈపీఎఫ్ఓకు వెళ్తుంది. దీనిపై వచ్చే వడ్డీని ప్రతీ ఏటా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ అకౌంట్‌లో జమ చేస్తుంది ఈపీఎఫ్ఓ. రూ.15,000 కన్నా తక్కువ బేసిక్ వేతనం ఉన్నవారికి ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి. అయితే అంతకన్నా ఎక్కువ వేతనం ఉన్నవారు ఫామ్ 11 డిక్లరేషన్ ఇచ్చి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయొచ్చు.

    EPFO Insurance: ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రూ.7,00,000 వరకు బీమా

    Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయింది? ఇలా తెలుసుకోండి

    ఉదాహరణకు ఓ ఉద్యోగి బేసిక్+డీఏ రూ.15,000 అనుకుందాం. అందులో 12 శాతం ఉద్యోగి వాటా అంటే రూ.1800 ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయాలి. ఇక యజమాని 8.33 శాతం వాటాను అంటే రూ.1250 ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో జమ చేస్తారు. మిగతా 3.67 శాతం వాటా అంటే రూ.550 ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తారు. ఇందులో రూ.1250 ఈపీఎస్‌లోకి వెళ్తుంది కాబట్టి అది లెక్కించకూడదు. ఈపీఎఫ్ అకౌంట్‌లోకి వెళ్లిన మొత్తం రూ.1800+రూ.550. అంటే మొత్తం రూ.2,350. ప్రతీ నెలా ఇంతే మొత్తం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతూ ఉంటుంది. ఇక ఈపీఎఫ్ వడ్డీ 8.5 శాతం. అంటే నెలకు 0.7083%. ఈ లెక్కన రూ.2,350 ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌కు రూ.33.29 వడ్డీ వస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: