EPFO: ఉద్యోగులు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... రెండు కొత్త మార్పులివే

EPFO | యూఏఎన్ తీసుకోవడం విషయంలో ఉద్యోగులు సంస్థ యాజమాన్యం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గుర్తించి ఈపీఎఫ్ఓ ఈ మార్పులు చేసింది.

news18-telugu
Updated: November 4, 2019, 3:09 PM IST
EPFO: ఉద్యోగులు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... రెండు కొత్త మార్పులివే
EPFO: ఉద్యోగులు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... రెండు కొత్త మార్పులివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO శుభవార్త చెప్పింది. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN ఆన్‌లైన్‌లో జనరేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకైతే ఉద్యోగులు యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ కోసం సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు సంస్థ యాజమాన్యం ప్రమేయం లేకుండా ఉద్యోగులే ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు. పీఎఫ్, పెన్షన్, జీవిత బీమా లాభాలను పొందేందుకు ఉద్యోగులు సంస్థ యాజమాన్యంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. యూఏఎన్ తీసుకోవడం విషయంలో ఉద్యోగులు సంస్థ యాజమాన్యం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గుర్తించి ఈపీఎఫ్ఓ ఈ మార్పులు చేసింది.

ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా శుభవార్త చెప్పింది ఈపీఎఫ్ఓ. పెన్షన్ పేమెంట్ ఆర్డర్-PPO లాంటి పెన్షన్ సంబంధిత డాక్యుమెంట్స్‌ని 65 లక్షల మంది పెన్షనర్లు డిజీలాకర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ దగ్గరున్న పెన్షనర్ల డేటాను నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) కు చెందిన డిజీలాకర్‌తో అనుసంధానించింది. దీని ద్వారా పెన్షనర్లు ఈపీఎఫ్ఓకు సంబంధించిన డాక్యుమెంట్లను డిజీలాకర్ ద్వారా పొందొచ్చు. ఈపీఎఫ్ఓ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రెండు కొత్త సదుపాయాలను కార్మిక శాఖ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. మరోవైపు యాజమాన్యాల కోసం డిజిటల్ ఇంటర్‌ఫేస్ ఇ-ఇన్‌స్పెక్షన్ కూడా ప్రారంభమైంది.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రూ.20,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే...
Loading...
Aadhaar Seva Kendra: తెలంగాణలో తొలి ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం... విశేషాలివే
First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...