హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF New Rule: కొత్త ఈపీఎఫ్ నిబంధన అమలులోకి వచ్చేసింది... లాభమిదే

EPF New Rule: కొత్త ఈపీఎఫ్ నిబంధన అమలులోకి వచ్చేసింది... లాభమిదే

EPF New Rule: కొత్త ఈపీఎఫ్ నిబంధన అమలులోకి వచ్చేసింది... లాభమిదే
(ప్రతీకాత్మక చిత్రం)

EPF New Rule: కొత్త ఈపీఎఫ్ నిబంధన అమలులోకి వచ్చేసింది... లాభమిదే (ప్రతీకాత్మక చిత్రం)

EPF New Rule | 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిర్ణయాన్ని ఈపీఎఫ్ఓ అమలు చేస్తూ నిబంధనల్ని మార్చింది. ఈ కొత్త రూల్‌తో లాభాలేంటో తెలుసుకోండి.

  ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కొత్త నియమ నిబంధనల్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణం. ఇప్పటికే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా పీఎఫ్ బ్యాలెన్స్‌ నుంచి ఉద్యోగులు 75% లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది పాండమిక్ అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తూ నిబంధనల్ని మార్చింది ఈపీఎఫ్ఓ. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక దీంతో పాటు 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్న ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇవే కాకుండా కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఈపీఎఫ్ విషయంలో మరి కొన్ని నిర్ణయాలను తీసుకుంది కేంద్రం. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా 12 శాతం చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గించింది.

  ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు నిబంధనల్ని మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. ఇది మూడు నెలలకే వర్తిస్తుంది. అంటే మే, జూన్, జూలై నెలలకు ఈపీఎఫ్ ఖాతాలో మొత్తం 24 శాతం కాకుండా కేవలం 20 శాతం చొప్పున జమ అవుతుంది. దీని వల్ల సంఘటిత రంగంలో పనిచేస్తున్న 4.3 కోట్ల మంది ఉద్యోగులకు మే, జూన్, జూలై నెలల టేక్ హోమ్ సాలరీ పెరుగుతుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది. రూ.15,000 కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ.15,000 లోపు వేతనం పొందుతూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నవారికి వర్తించదు. ఎందుకంటే వారికి కేంద్ర ప్రభుత్వమే 24 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది కాబట్టి వారికి ఈ రూల్ వర్తించదు.

  ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరో మూడు నెలల్లో రూ.6,750 కోట్ల నగదు లభ్యత ఏర్పడుతుందని అంచనా. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12 శాతం ఈపీఎఫ్ఓ అకౌంట్‌లో ఎప్పట్లాగే జమ అవుతుంది.

  ఇవి కూడా చదవండి:

  PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండి

  PMSBY Scheme: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు ఏడాదికి రూ.12 మాత్రమే... వివరాలివే

  Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Pension Scheme, Personal Finance

  ఉత్తమ కథలు