హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ తగ్గించుకుంటున్నారా? ఈపీఎఫ్ఓ క్లారిటీ

EPFO: మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ తగ్గించుకుంటున్నారా? ఈపీఎఫ్ఓ క్లారిటీ

EPFO | మీరు మీ పీఎఫ్ వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుంటున్నారా? దీనిపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO క్లారిటీ ఇచ్చింది.

EPFO | మీరు మీ పీఎఫ్ వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుంటున్నారా? దీనిపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO క్లారిటీ ఇచ్చింది.

EPFO | మీరు మీ పీఎఫ్ వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుంటున్నారా? దీనిపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO క్లారిటీ ఇచ్చింది.

  కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా 12 శాతం చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఆ రూల్ ప్రకారం ఎంప్లాయర్, ఎంప్లాయీ 10 శాతం వాటాను ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయొచ్చు. అయితే ఇది తప్పనిసరి కాదని ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులకు నగదు లభ్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగని ఈ తప్పనిసరిగా ఈపీఎఫ్ వాటాను తగ్గించుకోవాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. అంటే ఉద్యోగులు లేదా యాజమాన్యం కావాలంటే మే, జూన్, జూలై మాసాలకు ఎప్పట్లాగే 12 శాతం చొప్పున తమ వాటాను ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయొచ్చు. ఒకవేళ యాజమాన్యం 10 శాతం వాటాను జమ చేసినా ఉద్యోగులు మాత్రం 12 శాతం జమ చేయొచ్చు. లేదా ఉద్యోగి, యాజమాన్యం 10 శాతం చొప్పున జమ చేయొచ్చు. ఏ ఆప్షన్ అయినా ఎంచుకునే స్వేచ్ఛ ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఉంటుంది.

  ఇక గతంలోనే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా పీఎఫ్ బ్యాలెన్స్‌ నుంచి ఉద్యోగులు 75% లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది పాండమిక్ అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్న ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొదట మూడు నెలలకేనని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా మరో మూడు నెలలు పొడిగించింది.

  ఇవి కూడా చదవండి:

  SBI: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 10 టిప్స్ పాటించాలంటున్న ఎస్‌బీఐ

  SBI: మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్‌తో ఈ బ్యాంకింగ్ సేవలన్నీ సాధ్యం... ఎలాగంటే

  Smartphone: రూ.12,000 లోపు బెస్ట్ 6 స్మార్ట్‌ఫోన్లు ఇవే

  First published:

  Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Lockdown, Personal Finance

  ఉత్తమ కథలు