EPF Update: ఆధార్ లింక్ చేయకపోతే పీఎఫ్ విత్‌డ్రా సాధ్యం కాదు

EPF Withdrwal | ఆన్‌లైన్ క్లెయిమ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవాలని కంపెనీలకు సూచించింది. ఎవరైనా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే కేవలం ఆన్‌లైన్ క్లెయిమ్ దరఖాస్తు మాత్రమే అంగీకరిస్తుంది ఈపీఎఫ్ఓ.

news18-telugu
Updated: July 20, 2019, 5:03 PM IST
EPF Update: ఆధార్ లింక్ చేయకపోతే పీఎఫ్ విత్‌డ్రా సాధ్యం కాదు
EPF Update: ఆధార్ లింక్ చేయకపోతే పీఎఫ్ విత్‌డ్రా సాధ్యం కాదు
news18-telugu
Updated: July 20, 2019, 5:03 PM IST
మీ జీతంలోంచి నెలనెలా పీఎఫ్ అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతున్నాయా? మీ పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంటున్నారా? పీఎఫ్ విత్‌డ్రా విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO నిబంధల్ని మార్చింది. ఈపీఎఫ్ఓలోని మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌కు మీ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ చేసుకోలేరు. ఇలాంటి ఆఫ్‌లైన్ క్లెయిమ్స్‌ని నిరాకరిస్తోంది ఈపీఎఫ్ఓ. ఒకవేళ మీ యూఏఎన్‌కు ఆధార్ లింక్ చేసినట్టైతే ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా సంస్థలు ఆధార్ లింక్ చేయని యూఏఎన్ అకౌంట్ల నుంచి బల్క్‌ క్లెయిమ్స్ చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ దృష్టికి వచ్చింది. అవన్నీ ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ దరఖాస్తులే. దీంతో క్లెయిమ్ సెటిల్మెంట్ల విషయంలో ఫీల్డ్ ఆఫీసు సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. క్లెయిమ్ సెటిల్మెంట్లలో జాప్యం జరుగుతోంది. దీంతో ఆఫ్‌లైన్ దరఖాస్తుల్ని తీసుకోవద్దని సర్క్యులర్ జారీ చేసింది. ఆన్‌లైన్ క్లెయిమ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవాలని కంపెనీలకు సూచించింది. ఎవరైనా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తే కేవలం ఆన్‌లైన్ క్లెయిమ్ దరఖాస్తు మాత్రమే అంగీకరిస్తుంది ఈపీఎఫ్ఓ.

EPF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి ఇలా


ఈపీఎఫ్ ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ www.epfindia.com ఓపెన్ చేయండి.

ఆన్‌లైన్ క్లెయిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ link పేజీ ఓపెన్ అవుతుంది.
మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.


'Manage' ట్యాబ్‌లో 'KYC' పైన క్లిక్ చేయండి.
కేవైసీ పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి.
ఆ తర్వాత 'Online Services' ట్యాబ్‌లో 'Claim [Form-31,19&10C]' ఫామ్ పైన క్లిక్ చేయండి.
మీ వివరాలన్నీ 'Verify' చేసి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోండి.
మీరు ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ చేసుకుంటే కంపెనీ నుంచి మళ్లీ విత్‌డ్రా ఫామ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు.
మీ ఆన్‌లైన్ క్లెయిమ్‌ను ఫీల్డ్ ఆఫీసర్ వెరిఫై చేసి క్లెయిమ్ సెటిల్ చేస్తారు.
ఆన్‌లైన్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ సాఫీగా జరగాలంటే యూనిఫైడ్ పోర్టల్‌లో కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

EPF Withdraw: మీ పీఎఫ్ డబ్బులు ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసా?

EPFO: రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? ఇలా కలిపేయండి

EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...