హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్... రిటైర్మెంట్ వయస్సు పెంచే ఛాన్స్

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్... రిటైర్మెంట్ వయస్సు పెంచే ఛాన్స్

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్... రిటైర్మెంట్ వయస్సు పెంచే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్... రిటైర్మెంట్ వయస్సు పెంచే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

EPFO | ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్. రిటైర్మెంట్ వయస్సు పెంచే ప్రతిపాదనల్ని ఈపీఎఫ్ఓ పరిశీలిస్తోంది. పెన్షన్ ఫండ్‌పై (Pension Fund) ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రిటైర్మెంట్ వయస్సు పెంచే ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది. ప్రజల లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటే ఆయుర్దాయం పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా రిటైర్మెంట్ వయస్సు (Retirement Age) పెంచాలన్న అంశాన్ని ఈపీఎఫ్ఓ పరిశీలిస్తోందని ఎకనమిక్ టైమ్స్ కథనాన్ని పబ్లిష్ చేసింది. పెన్షన్ వ్యవస్థను మరింత అనుకూలంగా మార్చడం, ఈపీఎఫ్ ఖాతాదారులకు మరిన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ వయస్సు పెంచడంపై ఆలోచిస్తోంది. భారతదేశంలో 2047 నాటికి 60 ఏళ్లు దాటినవారి సంఖ్య 14 కోట్లు దాటుతుందని అంచనా. దీంతో భారతదేశంలోని పెన్షన్ ఫండ్స్‌పై తీవ్రమైన ఒత్తిడి కలగనుంది.

పెంచడం ఇతర దేశాల్లోని అనుభవాలకు అనుగుణంగా పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా పెన్షన్ వ్యవస్థల్ని అనుకూలంగా మార్చడం సాధ్యమవుతుంది ఈపీఎఫ్ఓ విజన్ 2047 డాక్యుమెంట్‌లో వివరించింది. పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా ఈపీఎఫ్ఓతో పాటు, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇతర పెన్షన్ ఫండ్స్‌లో నిధులను ఎక్కువ కాలం పాటు డిపాజిట్ చేయొచ్చు. ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గించడంలో సాయపడుతుందన్నది ఈపీఎఫ్ఓ అధికారుల వాదన.

Top 10 Safest Cars: ఇండియాలో టాప్ 10 సురక్షితమైన కార్లు ఇవే... 3 టాటా మోడల్స్‌దే హవా

రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ అయిన ఈపీఎఫ్ఓలో 6 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారికి చెందిన రూ.12 లక్షల కోట్ల కార్పస్ ఈపీఎఫ్ఓ దగ్గర ఉంది. ఈ మొత్తం పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్స్‌కు ఈపీఎఫ్ఓ కస్టోడియన్‌లా వ్యవహరిస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ పెన్షన్ స్కీమ్ లాంటి పథకాలను నిర్వహిస్తున్న పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి ఈపీఎఫ్ఓ వచ్చే అవకాశం ఉంది.

భారతదేశంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వృద్ధుల 2021 నివేదిక ప్రకారం భారతదేశంలో 60 ఏళ్లు పైబడ్డవారి సంఖ్య 2021లో 13.8 కోట్లు ఉండగా, 2031 నాటికి 19.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంటే 10 ఏళ్లలో 40 శాతం పెరిగింది. అంటే 60 ఏళ్లు దాటి జీవిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలను బట్టి రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉంది. యురోపియన్ యూనియన్‌లో 65 ఏళ్లు, డెన్మార్క్, ఇటలీ, గ్రీస్‌లో 67 ఏళ్లు, అమెరికాలో 66 ఏళ్లుగా రిటైర్మెంట్ వయస్సు ఉంది.

Post Office Scheme: ఓ పదేళ్లు ఇలా పొదుపు చేస్తే రూ.16.26 లక్షలు మీవే

మరోవైపు ఈపీఎఫ్ఓలో చేరుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జూన్‌లోనే కొత్తగా 18.36 లక్షల సబ్‌స్క్రైబర్స్ చేరారు. గతేడాదితో పోలిస్తే 43 శాతం అధికంగా రిజిస్టర్ అయ్యారు. ఈపీఎఫ్ఓ లెక్కల ప్రకారం 2021 జూన్‌లో 12.83 లక్షల మంది మాత్రమే కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: EPFO, Pension Scheme

ఉత్తమ కథలు