హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF: ఎక్కువ జీతం ఉన్నవారికి త్వరలో షాక్

EPF: ఎక్కువ జీతం ఉన్నవారికి త్వరలో షాక్

EPF: ఎక్కువ జీతం ఉన్నవారికి త్వరలో షాక్
(ప్రతీకాత్మక చిత్రం)

EPF: ఎక్కువ జీతం ఉన్నవారికి త్వరలో షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

Income Tax | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF, నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS, సూపర్ యాన్యుషన్ ఫండ్‌లో మొత్తం రూ.7.5 లక్షలు మించితే ఎంత ఎక్కువగా ఉంటే అంత డబ్బుకు పన్ను చెల్లించాలి.

  జీతం ఎక్కువ ఉన్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF, నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS, సూపర్ యాన్యుషన్ ఫండ్‌లో డబ్బులు దాచుకునేవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మూడు ఫండ్స్‌లో దాచుకునే మొత్తం రూ.7.5 లక్షల లోపు ఉంటే పన్ను లాభాలు పొందొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ దాచుకుంటే మాత్రం పన్ను చెల్లించక తప్పదు. ఈ నిబంధనలు 2021 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF, నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS, సూపర్ యాన్యుషన్ ఫండ్‌లో మొత్తం రూ.7.5 లక్షలు మించితే ఎంత ఎక్కువగా ఉంటే అంత డబ్బుకు పన్ను చెల్లించాలి. 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు వర్తించేలా 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి.

  ఉదాహరణకు ఓ వ్యక్తి పీఎఫ్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ రూ.3.6 లక్షలు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రూ.3 లక్షలు, సూపర్ యాన్యుషన్ ఫండ్‌ రూ.1.5 లక్షలు అనుకుంటే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ.8.1 లక్షలు అవుతుంది. ఈ మూడింటి మొత్తం పరిమితి రూ.7.5 లక్షలు మాత్రమే. అంటే రూ.60,000 ఎక్కువ కాబట్టి ఆ మొత్తానికి పన్ను చెల్లించక తప్పదు. ఒకవేళ ఈ మూడింటి మొత్తం రూ.7.5 లక్షల లోపు ఉంటే పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనలు ఎక్కువ జీతం తీసుకునే ఉద్యోగులపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా జీతం ఎక్కువ ఉన్న ఉద్యోగులు పన్ను లాభాలు పొందడంతో పాటు, భవిష్యత్ అవసరాల కోసం ఇలాంటి పథకాల్లో డబ్బు పొదుపు చేస్తుంటారు. తమకు అవసరం అయినప్పుడు వీటిలోంచి పాక్షికంగా విత్‌డ్రా చేస్తుంటారు. లేదా రిటైర్‌మెంట్ వరకు వేచిచూస్తుంటారు. అయితే వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినా పన్నులు చెల్లించే పరిస్థితి వస్తోంది.

  ఇవి కూడా చదవండి:

  Download Aadhaar: ఈ స్టెప్స్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు

  ATM: ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్

  PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే... త్వరపడండి

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: EPFO, Income tax, Investment Plans, Personal Finance, TAX SAVING

  ఉత్తమ కథలు