హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF: ఈపీఎఫ్ అకౌంట్‌ ఉందా? ఉద్యోగి వాటాపై కేంద్రం క్లారిటీ

EPF: ఈపీఎఫ్ అకౌంట్‌ ఉందా? ఉద్యోగి వాటాపై కేంద్రం క్లారిటీ

EPF: ఈపీఎఫ్ అకౌంట్‌ ఉందా? ఉద్యోగి వాటాపై కేంద్రం క్లారిటీ
(ప్రతీకాత్మక చిత్రం)

EPF: ఈపీఎఫ్ అకౌంట్‌ ఉందా? ఉద్యోగి వాటాపై కేంద్రం క్లారిటీ (ప్రతీకాత్మక చిత్రం)

EPF Account | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లో ఉద్యోగి వాటాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉద్యోగి, యజమాని వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు నిబంధనల్ని మారుస్తూ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈపీఎఫ్ఓ కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ద్వారా మే, జూన్, జూలై నెలలకు ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్ 10 శాతం చొప్పున ఈపీఎఫ్ అకౌంట్‌లో ‌డబ్బులు జమ అవుతాయి. ఈ నిబంధనపై కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.

  కావాలంటే ఉద్యోగులు తమ వాటాను 10 శాతం నుంచి పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ యజమానులు మాత్రం 10 శాతం జమ చేస్తే చాలని తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్-1952 ప్రకారం ఉద్యోగులు 10 శాతం లేదా అంతకన్నా ఎక్కువ తమ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయొచ్చని, యజమాని మాత్రం 10 శాతం జమ చేయాలని వివరించింది. కాబట్టి ఉద్యోగులు కోరుకుంటే గతంలోలాగే 12 శాతం చొప్పున ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేసుకోవచ్చు. ఒకవేళ 12 శాతం చొప్పున 24 శాతం కాకుండా 10 శాతం చొప్పున 20 శాతం మాత్రమే ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తే ఉద్యోగులకు మే, జూన్, జూలై నెలల టేక్ హోమ్ సాలరీ పెరుగుతుంది. సంఘటిత రంగంలో పనిచేస్తున్న 4.3 కోట్ల మందికి ఇది వర్తిస్తుంది.

  కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న పలు చర్యల్లో భాగంగా ఈపీఎఫ్ నిబంధనలు మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా పీఎఫ్ బ్యాలెన్స్‌ నుంచి ఉద్యోగులు 75% లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది పాండమిక్ అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్న ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

  ఇవి కూడా చదవండి:

  PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండి

  EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలా

  EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక... ఈ విషయాలు మర్చిపోవద్దు

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Lockdown, Personal Finance

  ఉత్తమ కథలు