హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇక ఈ వెసులుబాటు ఉండదు

EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇక ఈ వెసులుబాటు ఉండదు

EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇక ఈ వెసులుబాటు ఉండదు
(ప్రతీకాత్మక చిత్రం)

EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇక ఈ వెసులుబాటు ఉండదు (ప్రతీకాత్మక చిత్రం)

Employees Provident Fund | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో ఎంప్లాయీ, ఎంప్లాయర్ వాటా జమ చేసే విషయంలో మళ్లీ పాత నిబంధనలు అమలులోకి రానున్నాయి.

  కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వేతనజీవులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF కంట్రిబ్యూషన్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. 12 శాతంగా ఉన్న ఎంప్లాయీ, ఎంప్లాయర్ వాటాను 10 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల చేతికి నగదు ఎక్కువగా వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. మూడు నెలల పాటు 4% అదనంగా టేక్ హోమ్ సాలరీ పెంచడం ద్వారా లిక్విడిటీ పెరుగుతుందని భావించింది. ఈ నిర్ణయంతో సుమారు 6.5 లక్షల మంది ఉద్యోగులు లాభపడతారని, నెలకు రూ.2,250 కోట్ల చొప్పున లిక్విడిటీ పెరుగుతుందని భావించింది. ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీ, ఎంప్లాయర్ షేర్ 10 శాతం చొప్పున జమ చేస్తే చాలని చెప్పిన కేంద్రం... ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయర్ వాటా 12 శాతం చెల్లిస్తామని క్లారిటీ ఇచ్చింది.

  Gold Price: రూ.6,000 పెరిగిన బంగారం... జూన్‌లో గోల్డ్ కొన్నవారికి పండగే

  Loans: డబ్బులకు ఇబ్బందిగా ఉందా? అప్పులు ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు

  ఈపీఎఫ్ వాటా తగ్గించడం వల్ల మొత్తం 24 శాతం కాకుండా 20 శాతం మాత్రమే ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అయ్యేది. మే, జూన్, జూలై నెలలకు ఇది వర్తిస్తుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO గతంలోనే స్పష్టం చేసింది. జూలై ముగిసి ఆగస్టులోకి వచ్చేశాం కాబట్టి ఇక పాత పద్ధతి ప్రకారమే ఎంప్లాయీ, ఎంప్లాయర్ వాటా జమ చేయాల్సి ఉంటుంది. అంటే 12 శాతం చొప్పున 24 శాతం జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మే, జూన్, జూలై నెలల్లో ఈ వెసులుబాటు కారణంగా టేక్ హోమ్ సాలరీ ఎక్కువగా తీసుకున్నట్టైతే, ఆగస్ట్ నుంచి ఇది వర్తించదన్న విషయం గుర్తుంచుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: EPFO, Personal Finance

  ఉత్తమ కథలు