హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax on EPF Interest: మీ జీతం తక్కువా? అయితే ఈపీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ వర్తించదు... ఎలాగో తెలుసుకోండి

Tax on EPF Interest: మీ జీతం తక్కువా? అయితే ఈపీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ వర్తించదు... ఎలాగో తెలుసుకోండి

EPF Tax: మీ జీతం తక్కువా? అయితే ఈపీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ వర్తించదు... ఎలాగో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Tax: మీ జీతం తక్కువా? అయితే ఈపీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ వర్తించదు... ఎలాగో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Tax on EPF Interest | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలి. అయితే ఇది అందరికీ వర్తించదు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. తాము ఈపీఎఫ్‌లో జమ చేస్తున్న మొత్తంపై పన్ను చెల్లించాలేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఏడాదికి రూ.2,50,000 కన్నా ఎక్కువ జమ చేసేవారికే ఈ పన్ను వర్తిస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో ఏడాదికి రూ.2,50,000 జమ చేయాలంటే వేతనం భారీగా ఉండాలి. మరి ఎవరికి ఈ పన్ను వర్తిస్తుందో ఈ లెక్క ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉద్యోగి వాటా 12 శాతం ఉంటుంది. బేసిక్ వేతనం ప్రకారం 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయాలి. ఏడాదికి రూ.2,50,000 కన్నా ఎక్కువ జమ చేసేవారికి పన్ను వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏడాదికి రూ.2,50,000 అంటే నెలకు రూ.20,833 చొప్పున ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసేవారికే పన్ను వర్తిస్తుంది.

Ration Card: రేషన్ షాపులో సరుకులు తీసుకునేవారికి అలర్ట్... ఈ విషయాలు గుర్తుంచుకోండి

Gold Price Downfall: రూ.10,000 తగ్గిన బంగారం ధర... ఈ పతనం ఎంతవరకు?

మూల వేతనంలో 12 శాతాన్ని అంటే రూ.20,833 ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తున్నారంటే వారికి బేసిక్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా? రూ.1,73,600 పైనే ఉంటుంది. ఇది బేసిక్ వేతనం మాత్రమే. ఈ లెక్కన చిరుద్యోగులకు ఈ ట్యాక్స్ వర్తించదు. రూ.1,73,600 కన్నా ఎక్కువ బేసిక్ వేతనం ఉన్నవారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పిన పన్ను వర్తిస్తుంది. నెలకు రూ.1,00,000 వేతనం పొందుతున్నవారు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను పరిధిలోకి రారు. భారీగా వేతనం ఉన్నవాళ్లు మాత్రమే ఈ పన్ను పరిధిలోకి వస్తారు. ఇలా ఎక్కువ వేతనం పొందుతున్నవారే ఈపీఎఫ్‌లో జమ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పెట్రోల్ కొంటే రివార్డ్ పాయింట్స్... SBI IOCL Debit Card తీసుకుంటే లాభాలివే

Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా

ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌తో పాటు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో డబ్బులు జమ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈపీఎఫ్‌లో జమ చేసిన మొత్తంపై వచ్చే రిటర్న్స్ ఇందులోనూ వస్తాయి. అందుకే ఎక్కువ వేతనం పొందేవారు వీపీఎఫ్‌లో జమ చేస్తుంటారు. రిటర్న్స్‌పై ఇన్నాళ్లూ వడ్డీ చెల్లించాల్సిన అవసరం రాలేదు. ఇటీవల ఇలాంటి కంట్రిబ్యూషన్ ఎక్కువగా వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. ఒకవేళ ఈపీఎఫ్‌లో 12 శాతం, వీపీఎఫ్‌లో 12 శాతం చొప్పున జమ చేస్తున్నా రూ.2,50,000 వరకు ఎలాంటి పన్నులు ఉండవు. అంటే 24 శాతం రూ.2,50,000 మించకూడదు. రూ.86,000 వరకు బేసిక్ వేతనం ఉన్నవారికి పన్ను వర్తించదు. అంతకన్నా ఎక్కువ బేసిక్ వేతనం ఉన్నవాళ్లు వీపీఎఫ్‌లో జమ చేస్తున్నా పన్ను చెల్లించాల్సిందే.

First published:

Tags: EPFO, Income tax, Personal Finance, TAX SAVING

ఉత్తమ కథలు