EMPLOYEES OF CENTRE MAY GET HIKE OF TRAVEL ALLOWANCE TA AND HOUSE RENT ALLOWANCE HRA AK
Centre Employees: కేంద్ర ఉద్యోగులకు త్వరలోనే మరో గుడ్ న్యూస్.. అవి కూడా పెంపు ?
Centre Employees: కేంద్ర ఉద్యోగులకు త్వరలోనే మరో గుడ్ న్యూస్.. అవి కూడా పెంపు ?
Employees HRA: ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు 27 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారు. HRA అనేది ఉద్యోగం నివాసం ఉండే ప్రాంతం ఆధారంగా లెక్కించబడుతుంది. దీని కోసం నగరాలను X, Y, Z కేటగిరీలుగా విభజించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు తర్వాత, ఇతర అలవెన్స్‌లు పెరుగుతాయన్న అంచనాలు పెరిగాయి. త్వరలోనే కేంద్ర ఉద్యోగులకు దీనిపై శుభవార్త అందనుంది. కేంద్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని మోదీ ప్రభుత్వం 3 శాతం పెంచింది. ఇప్పుడు అది 34 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆర్‌బీఐ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు, గృహ రుణాల వడ్డీ రేట్లు, హోమ్ లోన్ ఈఎంఐ, హోమ్ లోన్ వడ్డీ రేట్లు" width="875" height="583" /> డీఏ పెంపు తర్వాత పెంపుదలకు లైన్ క్లియర్‌గా మార్గం సుగమం చేసిన ఇతర అలవెన్స్‌లలో HRA, ట్రావెల్ అలవెన్స్ (TA), సిటీ అలవెన్స్ ఉన్నాయి. డీఏ పెంపుతో కేంద్ర ఉద్యోగుల జీతం పెరుగుతుంది. పెరిగిన డీఏతో ఏప్రిల్ నెల జీతం వస్తుందని భావిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
దీనివల్ల 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డీఏ పెరుగుదల కారణంగా, TA, సిటీ అలవెన్స్ కూడా పెరుగుతాయి. హెచ్‌ఆర్‌ఏ 3 శాతం వరకు పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు 27 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారు. HRA అనేది ఉద్యోగం నివాసం ఉండే ప్రాంతం ఆధారంగా లెక్కించబడుతుంది. దీని కోసం నగరాలను X, Y, Z కేటగిరీలుగా విభజించారు.
X కేటగిరీ నగరాల్లో నివసిస్తున్న లేదా పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో అత్యధికంగా 3 శాతం పెరగవచ్చని అంచనా. వై కేటగిరీకి 2 శాతం, జెడ్ కేటగిరీ నగరాల్లోని ఉద్యోగులకు 1 శాతం పెరగవచ్చని అంచనా.(ప్రతీకాత్మక చిత్రం)
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.