Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు

Salary Hike | అన్ని అంశాలు లెక్కలోకి తీసుకుంటే భారతదేశంలో పెరిగే జీతమే ఎక్కువ. అయితే భారతదేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉండటంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

news18-telugu
Updated: December 4, 2019, 1:02 PM IST
Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు
Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతదేశంలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది భారతదేశంలో 9.2 శాతం జీతాలు పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం తేల్చింది. భారతదేశంలో 2020లో జీతాల వృద్ధి ఎలా ఉంటుందన్న అంశంపై కార్న్ ఫెర్రీ గ్లోబల్ సాలరీ ఫోర్‌క్యాస్ట్ అధ్యయనం జరిపింది. గతేడాది 10 శాతం ఉంటే, 2020 సంవత్సరంలో 9.2 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ శాతం తగ్గొచ్చు. ద్రవ్యోల్బణం 5 శాతంగా లెక్కేస్తే పెరిగే జీతం 5 శాతం మాత్రమేనని లెక్కించుకోవచ్చు. అయినా 9.2 శాతం అంటే ఆసియాలోనే చాలా ఎక్కువ. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే జీతాల పెరుగుదల 4.9 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2.8 ఉండొచ్చని అంచనా. అంటే వాస్తవంగా పెరిగే జీతం 2.1 శాతం మాత్రమే. ఆసియాలో 5.3 శాతం జీతం పెరుగుతుందని అంచనా వేస్తే ద్రవ్యోల్బణం 2.2 శాతం. వాస్తవంగా పెరిగే జీతం 3.1 శాతం మాత్రమే. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే భారతదేశంలో పెరిగే జీతమే ఎక్కువ. అయితే భారతదేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉండటంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరి జీతాలను పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. 130 దేశాల్లో 25,000 సంస్థల్లో 2 కోట్ల మంది ఉద్యోగుల డేటాను విశ్లేషించి జీతాల పెంపును అంచనా వేస్తుంది కార్న్ ఫెర్రీ గ్లోబల్ సాలరీ ఫోర్‌క్యాస్ట్.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:



Sundar Pichai: ఆండ్రాయిడ్‌తో సెన్సేషన్... అల్ఫాబెట్‌తో ప్రమోషన్... సుందర్ పిచాయ్ ప్రస్థానం ఇదే

Personal Loan: 5 నిమిషాల్లో లక్ష రూపాయల అప్పు... 'ఎంఐ క్రెడిట్‌'లో తీసుకోండి ఇలా

IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈ స్టెప్స్‌తో చాలా ఈజీ
First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...