Electric Vehicles | మీరు ఇబైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏంటని ఆలోచిస్తున్నారా? ఇబైక్ కొనుగోలుపై ఏకంగా రూ. 16 వేల వరకు ఆదా (Money) చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అందువల్ల కొంత కాలమే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ (Offer) ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే.. అధిక ప్రయోజనం పొందొచ్చు. ఆఫర్ వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఇమోటోరాడ్ కంపెనీ ఈ ఆఫర్ అందిస్తోంది. కంపెనీ తన ఇబైక్ ఈఎంఎక్స్ అక్వా మోడల్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ధర తగ్గింపుతో పాటుగా ఉచిత యాక్ససరీస్ వంటి బెనిఫిట్స్ కల్పిస్తోంది. దేశీ తొలి డ్యూయెల్ సస్పెన్షన్ ఇ- బైక్ ఇదే కావడం గమనార్హం. దీనిపై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీని రేటు రూ. 64,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 58,999కే కొనొచ్చ. అంటే మీరు రూ. 6 వేల డిస్కౌంట్ ఉందని చెప్పుకోవచ్చు.
రైతుల అకౌంట్లలోకి డబ్బులు.. జనవరి 28లోపు ఇలా చేస్తేనే..
అంతేకాకుండా ఈ ఇబైక్ కొనుగోలుపై రూ. 10 వేల విలువైన యాక్ససిరీస్ ఉచితగా పొందొచ్చు. హెల్మెట్, బ్యాగ్, తదితర ఐటమ్స్ ఉచితంగానే వస్తాయి. అంటే ఇలా మీరు మొత్తంగా ఇబైక్ కొనుగోలుపై రూ. 16 వేలు ఆధా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్ బెనిఫిట్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా పొందొచ్చు. ఇంకా లైఫ్ టైమ్ ఫ్రేమ్ వారంటీ లభిస్తోంది.
గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. బ్యాంక్ అదిరే ఆఫర్లు!
కాగా ఈ ఈఎంక్స్ అక్వా ఇబైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అలాగే ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అలాగే ఇందులో 10.4 ఏహెచ్ 36 వీ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. 36వీ 250 డబ్ల్యూ రియర్ హబ్ మోటార్ ఉంటుంది. ఇంకా ఇందులో థ్రోటెల్ మోడ్, పెడల్ అసిస్ట్, క్రూయిజ్ మోడ్, మెకానికల్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మూడు గంటల్లో 80 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. మీరు ఈ ఇబైక్ కొనుగోలు చేయాలని భావిస్తే.. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేయొచ్చు. సిటీ ట్రాఫిక్, ఆఫ్ రోడ్ వంటి వాటికి ఈ ఇబైక్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వల్ప దూరాలకు ఈ ఇబైక్‌ను ఉపయోగించుకోవచ్చు. పెడల్ అసిస్ట్ కూడా ఉంటుంది. అందువల్ల చార్జింగ్ లేకపోయిన తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E bike, Electric Vehicles, Latest offers, Offers