హోమ్ /వార్తలు /బిజినెస్ /

e-Bikes: రూ.24,999కే కొత్త ఇ-బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి. వెళ్లొచ్చు!

e-Bikes: రూ.24,999కే కొత్త ఇ-బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి. వెళ్లొచ్చు!

e-Bikes: రూ.24,999కే ఇ-బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి. వెళ్లొచ్చు!

e-Bikes: రూ.24,999కే ఇ-బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి. వెళ్లొచ్చు!

Electric Vehicles | మీరు కొత్తగా ఇబైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం మార్కెట్‌లోకి కొత్త ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే 40 కి.మి. వెళ్లొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Electric Scooter | పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) స్టార్టప్ ఇమోటొరాడ్ తాజాగా కొత్త ఇబైక్స్‌ను (e-Bike) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎలైట్ రేంజ్ ఇబైక్స్‌ను ఆవిష్కరించింది. ఇందులో అల్ట్రా ప్రీమియం డెసర్ట్ ఈగల్, నైట్ హక్ వంటి మోడళ్లు ఉన్నాయి. కంపెనీ అలాగే ఎక్స్ ‌ఫ్యాక్టర్ రేంజ్‌ను కూడా తీసుకువచ్చింది. ఇందులో ఎక్స్ 1, ఎక్స్ 2, ఎక్స్‌ 3 ఇబైక్స్ ఉన్నాయి. బెంగళూరు, గురుగ్రామ్ వంటి పట్టణాలు లక్ష్యంగా కంపెనీ వీటిని తీసుకువచ్చింది.

ప్రీమియం ఇబైక్స్ విభాగంలో అధిక మార్కెట్‌ వాటాతో దూసుకుపోతున్నామని కంపెనీ వెల్లడించింది. అదిరే పనితీరు, ప్రీమియం డిజైన్ వంటి వాటితో రైడర్లకు చేరువ అవుతున్నామని తెలిపింది. ఫిట్‌నెస్,అడ్వేంచర్ కోరుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయని పేర్కొంది. ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు ఈ ఇబైక్స్ అనువుగా ఉంటాయని ఇమోటొరాడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కో ఫౌండర్ కునాల్ గుప్తా తెలిపారు.

శుభవార్త.. వెండి ఢమాల్, రూ.3,700 పతనమైన ధర.. లేటెస్ట్ బంగారం రేట్లు ఇలా!

ఇమోటొరాడ్ డెసర్ట్ ఈగల్, నైట్ హాక్ అనేవి ప్రీమియం ఇబైక్స్. డెసర్ట్ ఈగల్ ధర రూ. 4,75,000గా ఉంది. ఇక నైట్ హాక్ ధర రూ. 5 లక్షలుగా ఉంది. ఈ రేటు చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓలా, ఏథర్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర కూడా ఈ రేంజ్‌లో లేదు. రూ. 1.5 లక్షల వరకు ఉంది. అంటే ఒక్క ఇమోటొరాడ్ ప్రీమియం ఇబైక్ రేటుతో మూడు ఓలా, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయొచ్చు.

బ్యాంక్ బంపరాఫర్.. డాక్యుమెంట్లు లేకుండా క్షణాల్లో ఉచితంగా క్రెడిట్ కార్డు పొందండి!

ఇకపోతే ఇమోటొరాడ్ ఎక్స్ సిరీస్ వెహికల్స్ విషయానికి వస్తే.. ఎక్స్ 1, ఎక్స్ 2, ఎక్స్ 3 అనేవి ఎకానమీ ఇబైక్స్. వీటి ధర అందుబాటులో ఉంది. ఎక్స్ 1 రేటు రూ. 24,999గా ఉంది. ఇక ఎక్స్ 2 రేటు రూ. 27,999గా ఉంది. అలాగే ఎక్స్ 3 రేటు రూ. 32,999 వద్ద ఉంది. వీటిల్లో డీటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. వీటి రేంజ్ 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటిల్లో 250 వాట్ రియర్ హబ్ మోటార్ ఉంటుంది. ఎక్స్ 1, ఎక్స్ 2లో 7.8 ఏహెచ్ బ్యాటరీ, ఎక్స్ 3లో 7 ఏహెచ్ బ్యాటరీ అమర్చారు. అందువల్ల ఇబైక్స్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్స్‌ను పరిశీలించొచ్చు. అయితే మార్కెట్లో కొన్ని కంపెనీలు రూ.30 వేల నుంచి రూ. 40 వేల రేంజ్‌లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫర్ చేస్తున్నాయి. అందువల్ల వీటిని కూడా పరిశీలించొచ్చు.

First published:

Tags: Bikes, E-bikes, Electric Bikes, Electric Scooter, Electric Vehicles

ఉత్తమ కథలు