600 మంది పైలట్లను తొలగించిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్

కరోనా వైరస్ ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం అవసరం లేని సిబ్బందిని తగ్గించుకుంటున్నామని.. ట్రైనీ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిలోనే ఎక్కువ మందిని తొలగిస్తున్నామని వెల్లడించారు.

news18-telugu
Updated: June 9, 2020, 7:21 PM IST
600 మంది పైలట్లను తొలగించిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. మూడు నెలలుగా అన్ని సంస్థలు తీవ్ర నష్టాల్లలో మునిగిపోయాయి. ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు నెలలుగా అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడంతో అన్ని ఎయిర్ లైేన్ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఖర్చులను తగ్గించుకునేందుకు.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా దుబాయ్‌కు చెందిన ఎయిర్ లైన్ సంస్థ ఎమిరేట్స్ 600 మంది పైలట్లను తొలగించింది. వారిలో పలువురు ఇండియన్ పైలట్లు కూడా ఉన్నారు.

ఇప్పటికే ఎమిరేట్స్ సంస్థ 192 మందిని తొలగించింది. తాజాగా 600 మందిని ఉద్యోగాల నుంచి తీసేయడంతో మొత్తం తొలగింపుల సంఖ్య 792కి చేరింది. కరోనా వైరస్ ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం అవసరం లేని సిబ్బందిని తగ్గించుకుంటున్నామని.. ట్రైనీ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిలోనే ఎక్కువ మందిని తొలగిస్తున్నామని వెల్లడించారు. ఎమిరేట్స్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థలో 60వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఐతే ఏవియేషన్ రంగంలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి కొన్ని సంస్థలు కూడా ఇదే బాటలో వెళ్లే అవకాశముందని తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: June 9, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading