హోమ్ /వార్తలు /బిజినెస్ /

Emirates A380: ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

Emirates A380: ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

Emirates A380 ( PC : Emirates)

Emirates A380 ( PC : Emirates)

Emirates A380: ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ (Emirates Airline) భారతీయులకు తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానంగా పేరుగాంచిన ఎమిరేట్స్‌ A380 (Emirates A380) ఏరోప్లేన్‌ సేవలను అక్టోబర్ 30, 2022 నుంచి బెంగళూరుకు విస్తరించనున్నట్లు వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ (Emirates Airline) భారతీయులకు తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం (Passenger Plane)గా పేరుగాంచిన ఎమిరేట్స్‌ A380 (Emirates A380) ఏరోప్లేన్‌ సేవలను అక్టోబర్ 30, 2022 నుంచి బెంగళూరు (Bengaluru)కు విస్తరించనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్‌ 30 నుంచి రోజూ దుబాయ్-బెంగళూరు మార్గంలో ఈ విమానం నడవనుంది. ఈ ఎయిర్‌లైన్స్ సంస్థ కొన్నేళ్ల క్రితమే ఈ అతిపెద్ద విమానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం కావడంతోపాటు ఇది అన్ని విలాసవంతమైన సౌకర్యాలను ఆఫర్ చేస్తోంది. మరి దీని విశేషాల గురించి తెలుసుకుందాం.

ఈ విమానంలో ఎకానమీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్‌ అనే మూడు తరగతులు ఉంటాయి. వీటన్నిటిలో గరిష్ఠంగా 853 మంది ప్రయాణించవచ్చు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఇప్పటి వరకు బోయింగ్ 777 ద్వారా దుబాయ్, బెంగళూరు మధ్య సేవలను అందిస్తోంది. A380 బెంగుళూరు గడ్డపై కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా దిగనుంది. టూరిజం, దుబాయ్‌కి వచ్చే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారతీయులకు ఈ విమాన సేవలను అందించాలని ఎమిరేట్స్ సంస్థ నిర్ణయించింది.

* ప్రత్యేకతలు..

ఎమిరేట్స్ A380 బరువు 510-575 టన్నుల మధ్య ఉంటుంది. అంటే 2 నీలి తిమింగలాలు (72.7 మీటర్లు), 5 జిరాఫీలు (24.1 మీటర్లు) పొడవు ఉంటుంది. దీనిని 40 లక్షల భాగాలతో తయారు చేశారు. A380కి బోయింగ్ 777 కంటే 45 శాతం ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో అదనంగా లెగ్‌రూమ్, అన్ని క్యాబిన్‌లలో బిగ్ స్క్రీన్లు ఉంటాయి. ఎమిరేట్స్ A380లోని మొత్తం 118 యూనిట్లను నడుపుతోంది. ఇది 2018 నుంచి వందకోట్ల కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించింది.

(Photo Credit : Emirates)

105 మిలియన్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చింది. A380 దుబాయ్, సౌదీ అరేబియాలోని జెడ్డా మధ్య ఉన్న 1,700 కి.మీ రూట్‌లో కూడా నడుస్తుంది. ఈ విమానం ప్రయాణించే రూట్స్‌లో ఇదే అతి తక్కువ దూరం ఉన్న రూట్. దుబాయ్, ఆక్లాండ్, న్యూజిలాండ్ మధ్య 14,193 కి.మీ. దూరమున్న రూట్‌లో కూడా నడుస్తుంది. ఈ విమానంలో ప్రయాణించే అత్యంత దూరం గల రూట్ ఇది.

ఈ విమానంలోని ఫస్ట్‌క్లాస్‌లో ప్రైవేట్ సూట్‌లు, షవర్ స్పాలు... బిజినెస్ క్లాస్‌లో ఫ్లాట్-బెడ్ సీట్లు, అదనపు గది, వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ.. ఎకానమీ క్లాస్‌లో అనుకూల లైటింగ్ వంటి సకల సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి దీనిలో ఇన్‌ఫ్లైట్ Wi-Fi కూడా అందుబాటులో ఉంటుంది. బిజినెస్ క్లాస్ ప్యాసింజర్లకు ఆన్‌బోర్డ్ లాంజ్ కూడా ఉంది. కంపెనీ నిర్దిష్ట గమ్యస్థానాల మధ్య కొత్త ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను కూడా ప్రారంభించింది.

(Photo Credit : Emirates)

దీని వేగం ఎంత?

GP7200 RR ట్రెంట్ 900 ఇంజన్‌ గల A380 గంటకు గరిష్టంగా 1,185 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. దీని గరిష్ట ఫ్లైయింగ్ రేంజ్ 8,000 నాటికల్ మైళ్లు (దాదాపు 15,000 కి.మీ) కాగా ఇది 43,100 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. మొదటి తరగతి ప్రయాణికులు Bvlgari టాయిలెట్‌లు, సిగ్నేచర్ టైమ్‌లెస్ స్పా ప్రొడక్ట్స్, స్లైడింగ్ ప్రైవసీ డోర్స్, పర్సనల్ మినీ-బార్, యాంబియంట్ లైటింగ్, ప్రైవేట్ సినిమా, వానిటీ టేబుల్, మిర్రర్ వంటివి పొందుతారు. ప్యాసింజర్లు మొత్తం సీటును పరుపుతో పూర్తిగా ఫ్లాట్ బెడ్‌గా మార్చుకోవచ్చు.

First published:

Tags: Bengaluru, Business, Dubai, Flight

ఉత్తమ కథలు