Loan | బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెల నుంచి బ్యాంక్ (Bank) రుణ గ్రహీతలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ – RBI) మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏప్రిల్ నెలలో మరోసారి కీలక పాలసీ రేటును పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది.
దేశంలో ద్రవ్యోల్బణం అంచనాలకు పైనే ఉంది. ఆర్‌బీఐ ప్రకారం చూస్తే.. ద్రవ్యోల్బణం 6 శాతం దిగువున ఉండాలి. అయితే జనవరి, ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం ఈ స్థాయి కన్నా పైనే నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్‌బీఐ గత ఏడాది మే నెల నుంచి రెపో రేటు పెంచుకుంటూ వస్తోంది.
గత ఏడాది మే నెల నుంచి చూస్తే.. ఆర్‌బీఐ రెపో రేటు ఏకంగా 2.5 శాతం మేర పైకి చేరింది. అయినా కూడా ద్రవ్యోల్బణం దిగిరావడం లేదు. ఈ క్రమంలో ఆర్‌బీఐ మరోసారి రెపో రేటు పెంచొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే బ్యాంకులు ఆర్‌బీఐ రెపో రేటే పెంపు నేపథ్యంలో వరుపెట్టి రుణ రేట్లు పెంచుకుంటూ వచ్చాయి. మరోసారి రెపో రేటు పెరిగితే.. బ్యాంకులు కూడా ఆ పెంపు ప్రభావాన్ని కస్టమర్లకు బదిలీ చేయొచ్చు. అంతిమంగా రుణ రేట్లు పెరుగుతాయి.
ఒక్కసారి చార్జ్ చేస్తే తిరుపతి నుంచి విజయవాడ వెళ్లొచ్చు.. తక్కువ ధరలో టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే కొత్తగా లోన్ పొందాలని చూసే వారిపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే.. వీరి నెలవారీ ఈఎంఐ పైపైకి చేరొచ్చు. లోన్ రీషెడ్యూల్ డేట్ నుంచి రేట్ పెంపు వర్తిస్తుంది. ఇక కొత్తగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. అప్పుడు వీరికి గతంలో కన్నా ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలు లభిస్తాయి. ఈ క్రమంలో కొత్త కస్టమర్లు వడ్డీ భారం మోయాల్సి వస్తుంది. ఇలా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు కారణంగా బ్యాంకులు రుణ రేట్లు పెంచడం వల్ల చివరకు బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇప్పడే లోన్ తీసుకుంటే కొంత మేర వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, EMI, Home loan, Personal Loan, Rbi, Reserve Bank of India