ECLGS: ఎమర్జెన్సీ క్రెడిట్ స్కీమ్ కింద లోన్... ఎలా తీసుకోవాలో తెలుసుకోండి

ECLGS: ఎమర్జెన్సీ క్రెడిట్ స్కీమ్ కింద లోన్... ఎలా తీసుకోవాలో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

ECLGS Loan | ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్- ECLGS ద్వారా వ్యాపారులు రుణాలు తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసిఎల్‌జిఎస్)ను గతేడాది ప్రారంభించింది. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు హామీ లేకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసేందుకు రూ.3 లక్షల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ క్రెడిట్ స్కీమ్​కు దరఖాస్తు చేసుకునేందుకు మొదట్లో 2020 అక్టోబర్ వరకు అవకాశం కల్పించారు. ఆ తరువాత దీన్ని నవంబర్ వరకు పొడిగించారు. ఈ తరువాత 2021 మార్చి, జూన్.. ఇలా పలు దఫాల్లో పొడిగిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. తొలుత ప్రారంభించిన ECLGS 1.0 కు కొనసాగింపుగా ECLGS 2.0, ECLGS 3.0 క్రెడిట్ స్కీమ్​లను కూడా ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా హాస్పిటాలిటీ, ట్రావెల్​ టూరిజం, లీజర్​ అండ్​ స్పోర్టింగ్​ రంగాల్లో వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు మంజూరు చేస్తుంది. ఇందు కోసం ప్రత్యేక విండోను కూడా ప్రారంభించింది.

ఎవరు అర్హులు?


ఈ స్కీమ్​ కింద గరిష్టంగా రూ .500 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తాయి బ్యాంకులు. హాస్సిటాలిటీ, ట్రామెలింగ్​, టూరిజం, స్పోర్ట్స్​ రంగాల్లో పెట్టుబడి పెట్టే వారికి ఇవి అందజేస్తారు. 2020 ఫిబ్రవరి 29 నాటికి స్పెషల్ మెన్షన్​ అకౌంట్స్​ (ఎస్​ఎంఏ) కలిగిన వారు ఈ ECLGS రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. SMA-0 అకౌంట్లు కలిగిన వారు తమ రుణాలను 1 నుంచి 30 రోజులు ఆలస్యంగా తిరిగి చెల్లించినప్పటికీ ఎటువంటి ఫైన్​ విధించరు. ఇక, SMA-1, SMA-2 అకౌంట్లు వరుసగా 31 నుండి -60 రోజులు, 61- నుండి 90 రోజుల వరకు చెల్లింపు సమయాన్ని కలిగి ఉంటాయి.

Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయింది? ఇలా తెలుసుకోండి

SBI Alert: జూన్ 30 లోగా ఈ పనిచేయండి... కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక

ఎంత క్రెడిట్ పొందవచ్చు?


ఈ క్రెడిట్​ స్కీమ్​ కింద గరిష్టంగా రూ .500 కోట్ల వరకు పొందవచ్చు. అయితే, ఎంఎస్​ఎంఈ సంస్థలు దీనిలో 20 శాతం (రూ. 100 కోట్లు) పొందే అవకాశం మాత్రమే ఉంది. హాస్సిటాలిటీ, ట్రామెలింగ్, టూరిజం, స్పోర్ట్స్ రంగాల్లో పెట్టుబడికి మాత్రం దీనిలో 40 శాతం (రూ. 200 కోట్లు) వరకు రుణం పొందవచ్చు. ఇంతకుముందు క్రెడిట్ రుణాలు తీసుకోని రుణగ్రహీతలు ECLGS కోసం దరఖాస్తు చేయలేరు. ఎందుకంటే, ఈ రుణాలను NBFCలకు, ఇతర అర్హత కలిగిన బ్యాంకులు మాత్రమే అందజేస్తాయి.

వడ్డీ రేటు ఎంత?


బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే 9.25 శాతం వడ్డీ, నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్స్​ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే 14 శాతం వడ్డీ చెల్లించాలి. లోన్​ తీసుకున్న రెండేళ్లు మారిటోరియం పీరియడ్ ఉంటుంది. అంటే మారిటోరియం కాలంలో రుణాలు చెల్లించాల్సిన పని లేదు. ఆ తర్వాత ఈఎంఐల రూపంలో రుణాలు చెల్లించాలి. తీసుకున్న మొత్తాన్ని ఈసిఎల్‌జిఎస్ 1.0 కింద 36 వాయిదాల్లో, ఈసిఎల్‌జిఎస్ 2.0 కింద 48 వాయిదాల్లో చెల్లించాలి. మారిటోరియం కాలం ముగిసిన తర్వాత మీ చెల్లింపు ప్రారంభమవుతుంది. రుణగ్రహీతలు అదనపు ఖర్చు లేకుండా ప్రీ-పే కూడా చేయవచ్చు.

PF Aadhaar Link: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? వెంటనే చేయండి ఇలా

EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... అకౌంట్‌లోకి వడ్డీ జమ చేసేది ఎప్పుడంటే

ఎన్ని బ్యాంకులు అందజేస్తున్నాయి?


2020 డిసెంబర్ 21 నాటికి, ఎస్​బీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్ మొదలైన 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈసిఎల్​జిఎస్​ స్కీమ్​ కింద రిజిస్టర్​ చేసుకున్నాయి. వీటితో పాటు లక్ష్మి విలాస్, కరూర్ వైశ్యా, ఫెడరల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వంటి చిన్న బ్యాంకులు, స్టాండర్డ్ చార్టర్డ్, డిబిఎస్ బ్యాంక్ ఇండియా, హెచ్ఎస్బిసి, సహా ఆరు విదేశీ బ్యాంకులు, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రిజిస్టర్​ చేసుకున్నాయి. మొత్తం ఆరు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, 42 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 127 ఎన్‌బిఎఫ్‌సిలు ఈసిఎల్‌జిఎస్ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published: