Elon Musk Not Join Twitter Board : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ లో ఇటీవల ఎలాన్ మస్క్ 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Elon Musk Not Join Twitter Board : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ లో ఇటీవల ఎలాన్ మస్క్ 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ వాటాల కంటే ఇది నాలుగు రెట్లు అధికం. దీంతో ట్విట్టర్ సంస్థలో అతిపెద్ద వాటాదారుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ సంస్థలో బోర్డు సభ్యుడిగా చేరుతాడని వార్తలు వస్తున్న క్రమంలో..ట్విట్టర్ సంస్థ బోర్డు సభ్యుల్లో ఎలన్ మస్క్ చేరడం లేదని ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ తెలిపారు. బోర్డ్ డైరెక్టర్ గా ఉండనని ఎలాన్ మస్క్ తనకు తెలియజేసినట్టు అగర్వాల్ వెల్లడించారు. ఈ అంశంపై వివరంగా ట్విట్టర్లో ఓ లేఖను పోస్ట్ చేశారు.
ఆ లేఖలో అగర్వాల్..బోర్డ్ లో చేరాలని మస్క్ తో చాలా సంప్రదింపులు జరిపాం. నేను నేరుగా మాట్లాడా. ఆయనతో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహం కనబరిచాం. ఆయన బోర్డ్ మెంబర్‌గా ఉండి సంస్థ, మిగిలిన షేర్‌హోల్డర్ల ప్రయోజనాల కోసం పని చేస్తారని నమ్మాం. బోర్డ్ లోకి అహ్వానించాం. ఏప్రిల్ 9వ తేదీన ఎలాన్ మస్క్‌ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా నియమించాం. అయితే తాను బోర్డ్‌లో కొనసాగలేనని ఆయన చెప్పారు. అది కూడా మంచికే అని నేను నమ్ముతున్నాం. బోర్డ్ లో ఉన్నా లేకున్నాషేర్హోల్డర్ల విలువైన సూచనలను ఎప్పుడూ తీసుకుంటామని అగర్వాల్ తెలిపారు. తమ సంస్థకు మస్క్ అతిపెద్ద వాటాదారుడిగా ఎలాన్ మస్క్ ఉన్నారని వెల్లడించారు. ట్విట్టర్ తన కార్పొరేట్ లక్ష్యాలపై మరింతగా దృష్టి సారిస్తుందని తెలిపారు. పరాగ్ ట్వీట్ చేసిన తర్వాత మస్క్ కూడా తనదైన స్టయిల్లో ట్విట్టర్లో ఓ ఎమోజీతో స్పందించారు.
మరోవైపు ఎప్పుడూ ఆకస్తికర పోల్స్ ను సోషల్ మీడియాలో నిర్వహిస్తూ వార్తల్లో నిలిచే,ఎలాన్ మస్క్ తాజాగా మరో ఆసక్తికర పోల్ నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని నిరాశ్రయులకు తాత్కాలిక నివాసం కల్పించేందుకు కేటాయించాలా అన్న పోల్ చేపట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులు చాలా మంది.. కార్యాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో మస్క్ ఈ పోల్ నిర్వహించారు. ఇందుకు ఏకంగా 91.3 శాతం మంది అవును అంటూ ఓటేశారు. 8.7 మంది మాత్రమే వద్దు అని స్పందించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.