Elon Musk | ఇటీవల ట్విట్టర్‌ను కొన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రముఖ బెవరేజెస్ కంపెనీ అయిన కోకాకోలాను (Coca Cola) కొంటానని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
పాపులర్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లతో కొనేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కోకా కోలా (Coca-Cola) కంపెనీని కొనేస్తానంటూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆయన ఓసారి ట్విట్టర్ గురించి ఇలాగే ఓ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కొనాలంటే ఎంతవుతుంది అంటూ 2017లో ట్వీట్ చేశారు. ఐదేళ్ల తర్వాత ట్విట్టర్‌ను కొనేశారు. ఇప్పుడు కోకా కోలా కంపెనీని కొంటానని, కొకైన్‌ను మళ్లీ తీసుకొస్తానని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఆయన ట్వీట్ చేసిన మూడు గంటల్లో ఆ ట్వీట్‌కు రెండు లక్షలకు పైగా రీట్వీట్స్, 80 వేలకు పైగా కామెంట్స్, 15 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
ఎలాన్ మస్క్ ట్వీట్‌తో కోకా కోలా ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎలాన్ మస్క్ సీరియస్‌గానే కోకా కోలాను కొంటారా లేకపోతే సరదాకు అలా ట్వీట్ చేశారా అన్న చర్చజరుగుతోంది. అయితే ట్విట్టర్‌ను సరదాగా చేద్దాం అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. అయితే అయిదేళ్ల క్రితం ట్విట్టర్ కొంటానని సరదాగా ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు అదే పనిచేశారు. మరి కోకా కోలా విషయంలో అలాగే చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.
Realme GT 2: రియల్మీ జీటీ 2 ఫస్ట్ సేల్ కాసేపట్లో... తొలి సేల్‌లో రూ.5,000 డిస్కౌంట్
ట్విట్టర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కించపరిచేలా ఎలాంటి ట్వీట్స్ చేయలేరు. ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ మిగతా అన్ని అంశాలపై మాట్లాడొచ్చు. దేశంలోని చట్టం ద్వారా అనుమతించిన వాక్స్వాతంత్రాన్ని ట్విట్టర్ ప్రోత్సహించాలని, రాజకీయంగా తటస్థంగా ఉండాలని ఎలాన్ మస్క్ అభిప్రాయపడుతుంటారు. ట్విట్టర్ DMలు సిగ్నల్ తరహా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉండాలని అయన కోరుకుంటున్నారు.
కోకా కోలాను నిజంగానే ఎలాన్ మస్క్ కొనాలనుకుంటే 284 బిలియన్ డాలర్లు కావాలి. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 253 బిలియన్ డాలర్లు మాత్రమే. కోకా కోలా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పోలిస్తే ట్విట్టర్ విలువ చాలా చిన్నది. కొకైన్ విషయానికి వస్తే గతంలో కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్‌లో కొకైన్ ఉండేది. కానీ అమెరికాలో కొకైన్‌పై నిషేధం విధించడంతో కోకాకోలాలో కొకైన్‌ను తొలగించారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.