నానాటికీ శక్తిమంతంగా మారుతోన్న సామాజిక మాధ్యమాలకు సంబంధించి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. (Elon Musk Buy Twitter) ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకు, స్పేస్ ఎక్స్ సీఈవో కూడా అయిన ఎలాన్ మస్క్‌తో ట్విటర్ బోర్డు డీల్ కుదిరింది. (Elon Musk Twitter Deal) మొత్తం 44 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.3.30 లక్షల కోట్లు) వెచ్చించి మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేశారు. (Twitter Sold) అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో సోమవారం ట్రేడింగ్ ముగిశాక కంపెనీ విక్రయంపై అధికారిక ప్రకటన వెలువడింది. ఒప్పందం ఖరారు అంశాన్ని ట్విటర్ సంస్థ, దాని సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు కొత్త యజమాని మస్క్ సైతం ధృవీకరించారు.
ట్విట్టర్‌లో 100 శాతం వాటాను సుమారు $44 బిలియన్లకు(భారత కరెన్సీలో , ఒక్కో షేరుకు దాదాపు $54.20కు అన్నింటినీ నగదు రూపంలో కొనుగోలు చేశారు. ఈ డీల్ ఇప్పటి వరకు లిస్టెడ్ కంపెనీ చేసిన అతిపెద్ద పరపతి కొనుగోలులలో ఒకటిగా నిలిచింది. ట్విట్టర్ తన వాటాదారులతో సమావేశం తర్వాత ఒక్కో షేరుకు $54.20 డీల్ ప్రకటించింది. కొనుగోలుకు మద్దతుగా మస్క్ ఫైనాన్సింగ్ ప్యాకేజీని ఆవిష్కరించిన నాలుగు రోజుల తర్వాత ఈ ఒప్పందం జరిగింది.
Twitter has a purpose and relevance that impacts the entire world. Deeply proud of our teams and inspired by the work that has never been more important. https://t.co/5iNTtJoEHf
— Parag Agrawal (@paraga) April 25, 2022
ఎలాన్ మస్క్ -ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం గురించి ట్విట్ సీఈవో పరాగ్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. ‘ట్విట్టర్ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఔచిత్యం గల సంస్థ. మా టీమ్ సభ్యుల పట్ల చాలా గర్వంగా ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని పని నుంచి ప్రేరణ పొందింది’అని పేర్కొన్నారు. సంస్థ విలువలకు అనుగుణంగానే అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎలాన్ మస్క్ ప్రతిపాదనను సరైన అంచనాతో ట్విటర్ బోర్డు ఆలోచనాత్మకమైన, సమగ్రమైన ప్రక్రియను నిర్వహించిందని, ప్రతిపాదిత లావాదేవీ గణనీయమైన నగదు ప్రీమియంను అందిస్తుందని ట్విటర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ చైర్ బ్రెట్ టేలర్ అన్నారు.
🚀💫♥️ Yesss!!! ♥️💫🚀 pic.twitter.com/0T9HzUHuh6
— Elon Musk (@elonmusk) April 25, 2022
ట్విటర్ సంస్థ కొనుగోలు డీల్ కుదిరిన విషయాన్ని వెల్లడిస్తూ కొత్త యజమాని ఎలాన్ మస్క్ కీలక సందేశాన్ని పోస్ట్ చేశారు. వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విటర్ ను తీర్చిదిద్దుతానని, కొత్త ఫీచర్లను తీసుకొస్తానని మస్క్ ఉద్ఘాటించారు. ‘నాపై దారుణమైన విమర్శలు చేసేవాళ్లు కూడా ట్విటర్ లో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అదే నిజమైన వాక్ స్వాతంత్ర్యం’అనే మాటలతో తన తీరు ఎలా ఉండబోతున్నదో మస్క్ చెప్పకనే చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, Social Media, Twitter