ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) మంగళవారం ట్విట్టర్ (Twitter)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మస్క్ 44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.30 లక్షల కోట్ల)తో ట్విట్టర్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నారు. దీంతో టెక్నాలజీ(Technology) ఫీల్డ్‌లో ఇది మూడో అతిపెద్ద కొనుగోలుగా అవతరించింది. ఈ డీల్‌పై మస్క్‌కి భారీ స్థాయిలో ఆసక్తిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుడి సొంతమైంది. అలానే ట్విట్టర్ కొనుగోలుతో మస్క్ తన బిజినెస్ పోర్ట్‌ఫోలియో (Business Portfolio)ను పెంచుకున్నారు. ఈ భారీ కొనుగోలు తర్వాత మస్క్ ఇప్పటివరకు స్థాపించిన వ్యాపారాలపై చర్చ మొదలయింది. ఇంతవరకు అతను స్టార్ట్ చేసిన వ్యాపారాల ఎన్ని? ఏళ్లగా అతని ఆదాయాన్ని పెంచిన లేదా భవిష్యత్తులో భారీ సంపద తెచ్చిపెట్టే కంపెనీలు ఏవి? అనే ప్రశ్నలు చాలామందిలో మొదలయ్యాయి. ఈ తరుణంలో మస్క్ బిజినెస్ పోర్ట్‌ఫోలియోపై ఓ లుక్కేద్దాం.
Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..
టెస్లా
ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన టెస్లా మస్క్ సొంతం. మస్క్ దీని ద్వారా తన నెట్ వర్త్ (Net Worth) పెంచుకుంటున్నారు. మస్క్ బిజినెస్ పోర్ట్‌ఫోలియోలో టెస్లా, ఇంక్ (Tesla, Inc) అత్యధిక మార్కెట్ వ్యాల్యూ కలిగి ఉంది. దీనిని 2003లో టెస్లా మోటార్స్‌గా స్థాపించారు. మస్క్ 2004లో 6.5 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో దానిలో అతిపెద్ద వాటాదారుగా కొనసాగారు. 2008 నుంచి దాని సీఈఓగా పనిచేశారు. ఏప్రిల్ 2022 నాటికి కంపెనీకి 1.1031 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ (Market Cap) ఉంది.
స్పేస్‌ఎక్స్
అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన లాజిస్టికల్ ఖర్చులను తగ్గించడం, మార్స్‌ను వలసరాజ్యం (Colonising) చేయాలనే కలతో మస్క్ 2002లో స్పేస్‌ఎక్స్‌ను స్థాపించాడు. స్పేస్‌ఎక్స్ (SpaceX) అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంది. ఇది నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వంటి అంతరిక్ష సంస్థలతో కలిసి పని చేస్తుంది. స్పేస్‌ఎక్స్ సంస్థ ఇప్పటికే 2,100 స్టార్‌లింక్ శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చింది. పేలోడ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి భూమికి చెక్కుచెదరకుండా తిరిగి తీసుకొచ్చిన మొదటి ప్రైవేట్ కంపెనీగా 2010లో స్పేస్‌ఎక్స్ అవతరించింది. దీని మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
బోరింగ్ కంపెనీ
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టన్నెల్ నిర్మాణ సేవల సంస్థ ది బోరింగ్ కంపెనీని మస్క్ 2016లో స్థాపించారు. ఇది తొలుత స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థగా ఉంది. అయితే 2018లో ఇది పూర్తిగా స్వతంత్ర సంస్థగా మారింది. ఈ సంస్థ ప్రస్తుతం 'ఇంట్రా-సిటీ' ట్రాన్సిట్ సిస్టమ్‌ల ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. రోడ్లు, హైవేలపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ కంపెనీని మస్క్ స్థాపించారు. కార్లు, రైళ్లు హై-స్పీడ్‌లో ప్రయాణించగలిగే సొరంగాల అండర్ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని బోరింగ్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని మార్కెట్ వ్యాల్యూ 5.675 బిలియన్ డాలర్లగా ఉంది.
న్యూరాలింక్
గ్రేట్ ఫ్యూచరిస్ట్ ఎలాన్ మస్క్ 2016లో న్యూరాలింక్ కార్పొరేషన్ అనే న్యూరోటెక్నాలజీ కంపెనీని సహ-స్థాపించారు. ఇది ఇంప్లాంటబుల్ బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్‌లను (BMIs) అభివృద్ధి చేసింది. దీంతో అద్భుతాలు సృష్టించాలని మస్క్ భావిస్తున్నారు. దీని మార్కెట్ విలువ 500 మిలియన్ - 1 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.