హోమ్ /వార్తలు /బిజినెస్ /

Elon Musk: త్వరలోనే రూ. 22 లక్షల కోట్లకు చేరుకోనున్న ఎలాన్‌ మస్క్‌ సంపద.. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు

Elon Musk: త్వరలోనే రూ. 22 లక్షల కోట్లకు చేరుకోనున్న ఎలాన్‌ మస్క్‌ సంపద.. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు

 (Image Source: Reuters)

(Image Source: Reuters)

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ హోదా దక్కించుకున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థికంగా అత్యంత శక్తివంతులు అవుతున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలు స్థాపించి ఎలక్ట్రిక్ కార్లు, అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

ఇంకా చదవండి ...

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ హోదా దక్కించుకున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థికంగా అత్యంత శక్తివంతులు అవుతున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలు స్థాపించి ఎలక్ట్రిక్ కార్లు, అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. త్వరలోనే మస్క్‌ 300 బిలియన్(రూ. 22 లక్షల కోట్లు) డాలర్ల సంపద కలిగిన మొట్టమొదటి వ్యక్తి కావచ్చని తెలుస్తోంది. అతని ఆస్తి బీభత్సంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. అక్టోబర్ 25న హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ టెస్లా నుంచి లక్ష ఎలక్ట్రిక్ కార్లను ఆర్డర్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మస్క్ సంపద అదే రోజున 36 బిలియన్ల డాలర్లకు పెరిగిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చరిత్రలో ఒకే రోజులో ఇంత మొత్తంలో సంపాదన పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇవి చదవండి.. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ డిజైన్ స్కెచ్‌లను విడుదల చేసిన హ్యూందాయ్‌

ప్రస్తుతం ఎలాన్‌ మస్క్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో జెఫ్ బెజోస్ కంటే దాదాపు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. మస్క్ ప్రస్తుత నికర సంపద 289 బిలియన్ల డాలర్లు. అంటే ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆటోమేకర్ టయోటా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ కంటే సింగిల్ మ్యాన్ మస్క్‌కే ఎక్కువ సంపద ఉందన్నమాట. హెర్ట్జ్ సంస్థ లక్ష కార్లు ఆర్డర్స్ చేసిందని వార్తలు రాగానే టెస్లా ఇంక్(Tesla Inc) షేర్ 13 శాతం పెరిగింది.

దాంతో టెస్లా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను చేరుకుంది. ఈ ఆనందకరమైన క్షణాలను సెలబ్రేట్ చేసుకుంటూ "వైల్డ్ $T1mes!" అని మస్క్ ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టారు. యాపిల్, అమెజాన్.కామ్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబేట్ వంటి సంస్థలు ఉన్న ట్రిలియన్-డాలర్ కంపెనీల ఎలైట్ క్లబ్‌లో చేరిన తొలి ఆటోమేకర్ కంపెనీ టెస్లాయే కావడం మరో విశేషం. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, టెస్లాలో మూడింట రెండు వంతుల నికర విలువ మస్క్ సొంతం.

ఇవి చదవండి..బైక్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారా..? క్లెయిమ్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుందో

దూసుకెళ్తున్న టెస్లా స్లాక్స్​..

ఈ ఒక్క ఏడాదిలోనే మస్క్ సంపద 119 బిలియన్ల డాలర్లకు ఎగబాకింది. టెస్లా స్టాక్‌లలో ఇటీవలి కాలంలో భారీ పెరుగుదల నమోదవుతోంది. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా టెస్లా స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారులు ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తిని కనబరుస్తుండటంతో ఈ ఏడాది ఆటో మేకర్ స్టాక్ ధర 45 శాతం మేర పెరిగింది.

2002లో స్థాపించిన రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ ద్వారా మస్క్ సంపద 10.6 బిలియన్‌ డాలర్లలు పెరిగింది.స్పేస్‌ఎక్స్‌ కొత్త, పాత పెట్టుబడిదారులతో 755 మిలియన్ డాలర్ల వరకు స్టాక్‌ను ఇన్‌సైడర్‌ల నుంచి 560 డాలర్ల చొప్పున విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా కంపెనీ విలువను 100.3 బిలియన్లకు పెంచుకుంది. ఈ వాటా విక్రయం తర్వాత ఈనెల రెండో వారంలో స్పేస్‌ఎక్స్‌ విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది.

అల్ట్రా మిలియనీర్ గా మారుతున్న మస్క్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ కంటే 184 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. నంబర్ 4 స్థానంలో ఉన్న బిల్ గేట్స్ కంటే మస్క్ 150 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉండటం ఆశ్చర్యపోవాల్సిన విషయమే.

First published:

Tags: Elon Musk

ఉత్తమ కథలు