Elon Musk: గంటల్లో 16.3 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి, ఢమాల్న పడిపోయిన ఎలోన్ మస్క్ ర్యాంక్

Elon Musk: టెస్లా కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ కొన్ని గంటల్లోనే భారీ నష్టాలను చవిచూశారు. ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడి స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు.

news18-telugu
Updated: September 9, 2020, 8:14 PM IST
Elon Musk: గంటల్లో 16.3 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి, ఢమాల్న పడిపోయిన ఎలోన్ మస్క్ ర్యాంక్
ఎలోన్ మస్క్, టెస్లా కంపెనీ అధినేత (FIle)
  • Share this:
Tesla Founder Elon Musk: ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడైన టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవప్థాపకుడు ఎలోన్ మాస్క్కు గట్టి షాక్ తగిలింది. బుధవారం తన కంపెనీ షేర్లు బాగా పడిపోవడంతో కొద్ది గంటల్లోనే ఆయన భారీ నష్టం చవిచూడాల్సి వచ్చింది.  భారీ నష్టం చవిచూసినప్పటికీ నికర ఆస్తి విలువ ఇప్పటికీ 82 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం మస్క్ బుధవారం ఒక్కరోజే 16.3 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. అతని ప్రస్తుత నికర విలువ 82.2 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా సెప్టెంబర్ 1న మస్క్ సంపద 115.4 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ప్రపంచంలోని మూడవ అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. తాజాగా ఆయన కంపెనీ షేర్లు పడిపోవడంతో బిలియనీర్స్ సూచికలో ఆరో స్థానానికి పడిపోయాడు. మస్క్ ఒక్కరోజులో కోల్పోయిన16 బిలియన్ డాలర్లు భారతదేశంలోని అనేక కంపెనీల మొత్తం మార్కెట్ విలువ కంటే ఎక్కువ.

ఎస్ & పి 500 లో ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుని చేర్చకపోవడంతో టెస్లా షేర్లు మంగళవారం 20 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో మస్క్ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కూడా ఒకే రోజులో 7.9 బిలియకాన్లను కోల్పోవడంతో అతని సంపద  186 బిలియన్లకు పడిపోయింది. కాగా బిల్ గేట్స్ 2.05 బిలియన్ లాభపడ్డాడు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 4.6 బిలియన్ డాలర్లను కోల్పోయారు.

ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఏడవ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ, తన సంపదను ఒకే రోజులో 421 మిలియన్ డాలర్లు పెంచుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచాడు. స్టీవ్ బాల్మెర్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వంటి బిలియనీర్లు కూడా మంగళవారం యుఎస్ స్టాక్ మార్కెట్లలో పేలవమైన పరుగుల కారణంగా బిలియన్ల సంపదను కోల్పోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 9, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading