హోమ్ /వార్తలు /బిజినెస్ /

Elon Musk: అమెరికాకు పొంచి ఉన్న అతిపెద్ద సమస్య అదే: ఎలాన్ మస్క్ హెచ్చరిక

Elon Musk: అమెరికాకు పొంచి ఉన్న అతిపెద్ద సమస్య అదే: ఎలాన్ మస్క్ హెచ్చరిక

 (Image Source: Reuters)

(Image Source: Reuters)

టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​.. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. భవిష్యత్తును ఊహించి కొత్త ఆవిష్కరణలను ప్రవేశ పెట్టడం వల్లే ఆయన ఈస్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ ఏదైనా చెబితే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది.

ఇంకా చదవండి ...

టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​.. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. భవిష్యత్తును ఊహించి కొత్త ఆవిష్కరణలను ప్రవేశ పెట్టడం వల్లే ఆయన ఈస్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ ఏదైనా చెబితే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. అలాంటి ఎలాన్ మస్క్ తాజాగా అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో ఆ దేశం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటో అంచనా వేశారు. జనాభా తరుగుదల భవిష్యత్తులో పెద్ద రిస్క్​గా మారబోతుందని మస్క్ హెచ్చరిస్తున్నారు. నాగరికతకు ఇది సవాల్​గా మారబోతుందని చెప్పారు.

ఈ విషయంపై ఇటీవల ట్వీట్​ చేసిన మస్క్​.. ఓ ఇంటర్వ్యూలోనూ ఈ విషయంపై మాట్లాడారు. ఏడుగురు పిల్లల తండ్రి అయిన ఈ కుబేరుడు.. జనాభా నియంత్రణ పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు తానే ఒక ఉదాహరణ అంటున్నారు. జనాభా తగ్గుదల ఒక సంక్షోభానికి కారణం కావచ్చని ఆయన చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అమెరికా సమస్యలను ఎదుర్కోవచ్చని అన్నారు. కరోనా వైరస్ విజృంభణ వల్ల అమెరికాలో మరణాలు ఎక్కువ సంభవించడంతో పాటు జననాల రేటు కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మస్క్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“జనాభా తగ్గుదల సమస్య సమీపంలోనే ఉందనుకుంటున్నా. అయితే ఇప్పటికీ కొందరు ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నేను కూడా మంచి ఉదాహరణ కావాలని ప్రయత్నిస్తున్నా. నాకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్నారు. జనాభా తగ్గడమనేది చాలా పెద్ద సమస్య. భూమి ఒక్కటే ఉందని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నదాని కంటే ఇదే పెద్దది. అంగారకుడిపైనా జీవించే పరిస్థితి రావొచ్చు. అక్కడైతే ప్రస్తుతం ఎవరూ లేరుకదా. అంగారక గ్రహానికి ప్రాణం పోద్దాం” అని మస్క్​ వివరించారు.

మరోవైపు మానవులను అంగారక గ్రహం(మార్స్​)పై తీసుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని మస్క్ గత సంవత్సరంలోనే చెప్పారు. 2026 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. విశ్వమంతా ప్రజలదే అని అభిప్రాయపడ్డారు. కాగా అంగారకుడిపై తీసుకెళతానని మస్క్ చెప్పడం పట్ల కొందరు శాస్త్రవేత్తలు, సోషల్ యాక్టివిస్ట్​లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదాల నుంచి భూమిని ఎలా కాపాడాలో ఇప్పుడు ఆలోచించకుండా.. అంగారకుడిపై తీసుకెళతానని చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా వ్యాపారం కోసమేనని కొందరు విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే మస్క్ మాత్రం మార్స్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తూ ఎప్పటికప్పుడు ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.


తన స్పేస్ ఎక్స్​ కంపెనీ ద్వారా అంతరిక్షానికి యాత్రికులను పంపాలని మస్క్ భావిస్తున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్​, బ్రిటన్​ బిలీనియర్ బ్రాన్సన్​.. ఇటీవలే తమ సంస్థల ఎయిర్​క్రాఫ్ట్​ల్లో అంతరిక్షానికి వెళ్లి వచ్చారు. స్పేస్​కు పర్యాటకులను పంపాలన్న ఆలోచనతో దీన్ని ప్రయోగించారు. మస్క్ సైతం అతిత్వరలోనే తన ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో మరో మూడేళ్లలోనే స్పేస్ టూరిజం ఊపందుకున్నా ఆశ్చర్యం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

First published:

Tags: Business

ఉత్తమ కథలు