ELON MUSK ANNOUNCES TESLA MERCH BUYABLE WITH DOGECOIN MK
ఇకపై Dogecoinతో టెస్లా కార్లు కొనుగోలు చేయవచ్చని ట్వీట్ చేసిన Elon Musk..దెబ్బకు డోజ్ కాయిన్ దశతిరిగిందిగా...
ప్రతీకాత్మకచిత్రం
తాజాగా టెస్లా కార్లను డోజ్కాయిన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా డోజ్ కాయిన్ గతి మారిపోయింది. మస్క్ ట్వీట్ చేయగానే డోజ్కాయిన్ కు రెక్కలు వచ్చాయి.
Elon Musk Going to Accept Dogecoin: క్రిప్టో కరెన్సీలకు ఎలాన్ మస్క్ దేవుడయ్యాడు. అతడు వేసే ట్వీట్ దెబ్బకు క్రిప్టోకరెన్సీల జాతకం మారిపోతోంది. అంతేకాదు క్రిప్టో కరెన్సీలు ఈ మధ్యకాలంలో బిట్‌కాయిన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ గత కొన్ని రోజులుగా క్షీణిస్తోంది. అదే సమయంలో Cryptocurrency Dogecoin ధర 25 శాతం కంటే ఎక్కువ బలపడింది. వాస్తవానికి, డోజ్కాయిన్ ధరలో ఈ పెరుగుదల SpaceX యజమాని , టెస్లా CEO ఎలోన్ మస్క్ ట్వీట్ చేసిన అనంతరం పెరిగింది. తాజాగా టెస్లా కార్లను డోజ్కాయిన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా డోజ్ కాయిన్ గతి మారిపోయింది. మస్క్ ట్వీట్ చేయగానే డోజ్కాయిన్ కు రెక్కలు వచ్చాయి. డోజ్కాయిన్ శుక్రవారం 0.1623 డాలర్ల నుండి 0.2029 డాలర్లకు పెరిగింది. డోజ్కాయిన్ ప్రపంచంలోని టాప్ 10 డిజిటల్ టోకెన్లలో ఒకటిగా మారింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్‌కి క్రిప్టోకరెన్సీ అంటే తెగ మోజు. గత సంవత్సరం, డోజ్కాయిన్ వంటి క్రిప్టో ఆస్తులను పెట్టుబడిదారులు అదుపులో ఉంచుకోవాలనే ఆలోచనకు మస్క్ మద్దతు ఇచ్చారు. డోజ్కాయిన్ తనకు ఇష్టమైన కాయిన్ అని మస్క్ సోషల్ మీడియాలో పలు ట్వీట్లను పోస్ట్ చేశాడు. ఇది ఈ డిజిటల్ కరెన్సీని బాగా ప్రాచుర్యం పొందింది. డోజ్కాయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ. ఈ నాణెం 2014 సంవత్సరంలో ఒక జోక్‌గా ప్రారంభించారు. అప్పటి నుండి ఇది దాని పెట్టుబడిదారులకు 45,000 శాతం రాబడిని ఇచ్చింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.