Viral Photo: ఒకే ఫొటోలో ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్.. వారిద్దరూ ఎందుకు కలిశారో తెలుసా...

ఎలోన్ మస్క్, టెస్లా కంపెనీ అధినేత (FIle)

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కలిసి కూర్చొని ఉన్న ఫొటో అది. దీన్ని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా లైకులు, రీట్వీట్లతో యూజర్లు దాన్ని వైరల్ చేసేశారు. ఈ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించారు.

  • Share this:
ప్రపంచంలోని కుబేరులు ఎక్కడ కలుస్తారు? సాధారణంగా ఎప్పుడూ బిజీగా ఉండే వారు కలవడం అరుదే. కానీ ఎప్పుడైనా కలిస్తే ఏదైనా ఫైనాన్షియల్ మీటింగ్స్ లేదా బిజినెస్ లకు సంబంధించిన కార్యక్రమాల్లో కలుస్తారు. వారిని అలా చూసిన అభిమానులు ఇద్దరూ కలిసి కనిపించేలా ఫొటోలు తీస్తూ ఉంటారు. తాజాగా అలాంటిదే ఓ ఫొటో వైరల్ గా మారింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కలిసి కూర్చొని ఉన్న ఫొటో అది. దీన్ని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా లైకులు, రీట్వీట్లతో యూజర్లు దాన్ని వైరల్ చేసేశారు. ఈ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించారు.

ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ భోజనం చేస్తూ అంతరిక్షం గురించి మాట్లాడుకున్నారు. వారు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న అతి కొద్ది సందర్భాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఫొటో తీసి 17 సంవత్సరాలైంది. అంతరిక్షాన్ని అందుకునేందుకు తాము ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో వారు ఒకరికొకరు పంచుకున్నారు. అంటూ ట్రంగ్ ఫాన్ అనే ఈ యూజర్ షేర్ చేసుకోవడం విశేషం. జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ లు మధ్య ఉన్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రస్తుతం ఉన్నంత పెద్ద సంస్థ కాకముందే 2000 సంవత్సరంలోనే బ్లూ ఆరిజిన్ అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ మానవసహిత స్పేస్ ఫ్లైట్లను తయారుచేసేందుకు నిర్ణయించారు. ఆయనకు అందరిక్షానికి సంబంధించిన స్టడీ అంటే అప్పుడు అంత ఇష్టంగా ఉండేది. 2002 సంవత్సరంలో పేపాల్ సంస్థను అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో స్పేస్ ఎక్స్ అనే కంపెనీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత 2004 లో వీరిద్దరూ తమ సంస్థలకు సంబంధించి మాట్లాడారు. ఆ తర్వాతే వీరి మధ్య గొడవ ప్రారంభమైంది. దశాబ్దం పాటు కొనసాగింది.



ఈ ఫొటోకి బెజోస్ స్పందించలేదు కానీ ఎలోన్ మస్క్ స్పందించారు. వావ్.. అప్పుడే పదిహేడు సంవత్సరాలైందా? నమ్మలేకపోతున్నా.. అంటూ ఈ ట్వీట్ కి సమాధానం ఇచ్చారు. ఇటీవలే ప్రపంచంలోని అత్యధిక ధనవంతుడిగా ఎలాన్ మస్క్ స్థానాన్ని తాను పొందారు జెఫ్ బెజోస్. గత వారం టెస్లా స్టాక్స్ విలువ 6.9 శాతం తగ్గింది.

దీని ఫలితంగా ఎలాన్ మస్క్ తలసరి విలువ పదకొండు బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం.
First published: