Huawei : డ్రైవర్ లెస్ కారు తయారీలో అడుగుపెట్టిన చైనీస్ దిగ్గజం హువావే...

(REUTERS)

చైనీస్​ మల్టీనేషనల్​ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్​ టెక్నాలజీస్ ఆటోమోటివ్​ స్పేస్​లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు లీకులు అందుతున్నాయి. అయితే ఇఫ్పుడు డ్రైవర్​లెస్​ కార్లను తయారు చేస్తామనే ప్రకటన రావడంతో ఆటోమొబైల్ రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి.

  • Share this:
    ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ హువావే​ వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు ఏకంగా డ్రైవర్ లెస్​ కార్ల టెక్నాలజీకి శరవేగంగా పావులు కదుపుతోంది. 2025 నాటికల్లా డ్రైవర్​లెస్​ కారును మార్కెట్​లోకి రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ప్లానింగ్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, చైనీస్​ మల్టీనేషనల్​ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్​ టెక్నాలజీస్ ఆటోమోటివ్​ స్పేస్​లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు లీకులు అందుతున్నాయి. అయితే ఇఫ్పుడు డ్రైవర్​లెస్​ కార్లను తయారు చేస్తామనే ప్రకటన రావడంతో ఆటోమొబైల్ రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే, గూగుల్, అలాగే టెస్లా లాంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, ప్రోటోటైపులను తయారు చేశాయి. అయితే చైనీస్ దిగ్గజ కంపెనీ హువావే కూడా ఈ విభాగంలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు హువావే తాజాగా చైనీస్ ఆటో మొబైల్ సంస్థ చోంగ్​క్వింగ్​ ఛాంగన్​ కో లిమిటెడ్​తో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్​ వెహికిల్స్​ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రెండు కంపెనీలతో హువావే​ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

    ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్​ కంపెనీగా పేరుసంపాదించిన హువావే. ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో అనేక ఆంక్షలు ఎదుర్కుంది. ఇక హువావేతో పాటు షాయోమి, ఒప్పో కూడా వాహన తయారీ రంగం​లోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక అటు యాపిల్ సంస్థ కూడా డ్రైవర్ లెస్ కారు తయారీలో అడుగుపెడుతున్నట్లు కొన్నని లీకులు వదిలింది.
    Published by:Krishna Adithya
    First published: