Home /News /business /

ELECTRIC VEHICLES SALES IN INDIA TO TOUCH 10 LAKH UNITS THIS YEAR SMEV GH VB

Electric Vehicles: జోరుగా సేల్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్​లు.. ఈవీలపై ఎందుకంత క్రేజ్..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్​లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఈవీల విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉంది. ఇది గత 15 ఏళ్లలో అమ్ముడైన ఈవీలతో సమానమని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (SMEV) తెలిపింది.

ఇంకా చదవండి ...
భారత్​లో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఈవీల విక్రయాలు (EV sales) 10 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉంది. ఇది గత 15 ఏళ్లలో అమ్ముడైన ఈవీలతో సమానమని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (SMEV) తెలిపింది. గత 15 ఏళ్లలో ఈవీల మార్కెట్​ తీరును పరిశీలిస్తే, ఈ రంగం గణనీయ వృద్ధి సాధించినట్టు తెలుస్తోంది. ఒక్క 2021లోనే దేశంలో ఎలక్ట్రిక్ బైక్​ల విక్రయాలు రెండు రెట్లు పెరిగాయంటే ఈ-బైక్స్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని గమనించవచ్చు. 2020లో 33,971 టూవీలర్ ఈవీ యూనిట్లు అమ్ముడవగా.. 2021లో 1,00,736 సేల్స్(Sales) నమోదయ్యాయి. ఇవేగాక త్రీ వీలర్‌లు(Three Wheeler), ఈ-కార్లు(E Cars), ఎలక్ట్రిక్ బస్సులు(Electric Buses) సైతం పెద్దసంఖ్యంలోనే అమ్ముడయ్యాయి.

Sankranthi Offer: యాపిల్​ లవర్స్​కు సంక్రాంతి ఆఫర్.. ఆ ఐఫోన్ సిరీస్ పై భారీ డిస్కౌంట్..​


2022లోనూ ఇదే జోరు కొనసాగుతుందని SMEV డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ అన్నారు. ఈ ఏడాదిలో ఒక మిలియన్ యూనిట్లను విక్రయించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫేమ్​-2(FAME-II) నిబంధనల ద్వారా దేశంలో ఈవీ విధానంలో ఇటీవల అమలుచేసిన పలు మార్పులు గేమ్​-ఛేంజర్​లా ఉపయోగపడతాయని చెబుతున్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్​లను ప్రోత్సహింతడంతో పాటు.. శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంస్కరణలు, కీలక నిర్ణయాలు ఈవీ రంగానికి గొప్ప మేలు చేస్తాయని ఆయన తెలిపారు.

ఈవీలపై ఎందుకంత క్రేజ్..?
ఆకర్షణీయ ధరలతో(electric bike cost) పాటు రన్నింగ్ ఖర్చులు తక్కువగా ఉండటం, నిర్వహణ భారం సైతం తక్కువగా ఉండటంతో వినియోగదారులు పెట్రోల్ బైక్​ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతున్నారు. అంతేగాక పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడం కూడా ఈవీ మార్కెట్ వృద్ధికి మరో కారణం. ఎస్​ఎంఈవీ-వాహన్(SMEV VAHAN) డేటా ప్రకారం.. హీరో ఎలక్ట్రిక్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ 2021లో 46,214 యూనిట్ల అమ్మకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. జాబితాలో ఆ తర్వాతి స్థానంలో ఒకినావా 29,868 యూనిట్లు, ఆథర్ 15,836 యూనిట్లు, ఆంపియర్ 12,417 వాహనాలు ఉన్నాయి.

Nokia 2022: నోకియా లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ.10 వేలలోపు నోకియా స్మార్ట్​ఫోన్లు లాంచ్​..


లైసెన్స్, రిజిస్ట్రేషన్​ ఎలా?
గంటకు 25కిమీ కంటే తక్కువ వేగంతో వెళ్లే ఎలక్ట్రిక్ వాహనాలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ తరహా వాహనాలు 2020లో 73,529 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021లో 24 శాతం వృద్ధి చెంది 91,142 వాహనాలు విక్రమయ్యాయి. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా హై-స్పీడ్ బైక్‌లపై ఆయా సంస్థలు ప్రోత్సాహకాలనూ అందిస్తున్నాయి.

మార్కెట్​లో ప్రధాన వాటా
రాబోయే రెండు, మూడేళ్లలో దేశంలోని ప్రధాన ఉత్పత్తి సంస్థలు(ev manufacturers in india) ఈ-స్కూటర్లు, ఈ-సైకిల్స్​ను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయని గిల్ అంటున్నారు. ఇక నాలుగైదేళ్లలో ద్విచక్ర వాహనాల మార్కెట్లో దాదాపు 30 శాతం వాటాను ఈవీలు రీప్లేస్ చేస్తాయని అంచనా వేస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Electric Bikes, Electric Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు