భారతదేశంలో పెట్రోల్ వాహనాలతో(Petrol Vehicles) పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దీనితో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అందని ద్రాక్షలా మిగులుతున్నాయి. అయితే రాబోయే రెండేళ్లలో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు (EV Prices) పెట్రోల్ వెహికల్స్ తో సమానంగా ఉంటాయని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పుకొచ్చారు. గురువారం పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్ల గురించి అడిగిన ఓ ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు గడ్కరీ. రెండేళ్లలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ త్రీవీలర్స్(Electric Three Wheelers), ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్(Four Wheelers) ధరలు పెట్రోల్ వాహనాల ధరల వలె నార్మల్ గానే ఉంటాయని.. దేశంలో మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గురువారం పార్లమెంటులో గడ్కరీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఆవరణలో ఛార్జింగ్ స్టేషన్ కోసం స్థలం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించారు. ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఎంపీలు ఈవీలను కొనుగోలు చేయవచ్చని గడ్కరీ చెప్పారు. "ప్రతి ప్రభుత్వ ప్రాంగణంలో, పార్కింగ్ సిస్టమ్‌లో విద్యుత్ ఛార్జింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని మేం భావిస్తున్నాం" అని ఆయన చెప్పారు. కేంద్ర రవాణా మంత్రి ప్రకారం, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను జారీ చేసింది.
రెండు రోజుల క్రితం అంటే బుధవారం నాడు నితిన్ గడ్కరీ హైడ్రోజన్‌తో నడిచే తన కారు టొయోటా మిరాయ్‌లో పార్లమెంటుకు చేరుకున్నారు. ఇదే సందర్భంగా హైడ్రోజన్ ఇంధనమే భవిష్యత్తు అని చెప్పుకొచ్చారు. "పెట్రోల్, డీజిల్ ఫ్యూయల్ లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిసిటీ, గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్, బయో డీజిల్ వంటి ఇంధనాలు ఉన్నాయి. ఇలాంటి ఇంధనాలను మన దేశంలో తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం." అని కేంద్ర మంత్రి అన్నారు.
కేంద్ర మంత్రి గడ్కరీ కారును జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ తయారుచేసింది. ఈ కారులో హైడ్రోజన్ ఫ్యూయల్ ను ఫరీదాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ పంప్ నుంచి ఫిల్ చేశారు. "ఆత్మనిర్భర్ గా మారేందుకు మేం నీటి నుంచి ఉత్పత్తి చేసిన గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంట్రడ్యూస్ చేసాం. ఈ కారు పైలట్ ప్రాజెక్ట్. ఇప్పుడు దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రారంభమవుతుంది. దీనివల్ల దిగుమతులను అరికట్టడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి’’ అని మంత్రి చెప్పారు.
Pension Scheme: ఈ స్కీమ్‌లో ఈరోజు చేరితే నెలకు రూ.9,250పెన్షన్ ఇచ్చే పథకం
ఫ్యూచర్ ఫ్యూయల్ ని ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించేందుకు త్వరలో ఢిల్లీ రోడ్లపై హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారులో తాను కనిపిస్తానని జనవరిలో గడ్కరీ చెప్పారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఆయన హైడ్రోజన్ కారులో తిరుగుతున్నారు. బుధవారం పార్లమెంటులో, గడ్కరీ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ గురించి మాట్లాడారు. "ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ దేశ రాజధానిలో కాలుష్య స్థాయిలను కూడా తగ్గిస్తుంది" అని గడ్కరీ అన్నారు. మేం జింక్-అయాన్, అల్యూమినియం-అయాన్, సోడియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేస్తున్నాం. ఈ బ్యాటరీల వల్ల పెట్రోల్ వెహికల్స్ పై మీరు రూ.100 ఖర్చు చేస్తుంటే, ఎలక్ట్రిక్ వాహనంపై మీరు రూ.10 ఖర్చు చేస్తే సరిపోతుంది" అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.