Home /News /business /

ELECTRIC VEHICLES INDIA TO BE THE THIRD LARGEST CONSUMER OF ELECTRIC VEHICLES IN THE WORLD BY 2030 GH VB

Electric Vehicles: పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం.. 2030 నాటికి ప్రపంచంలో భారత్ స్థానం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియా(India) ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద కార్‌ మార్కెట్‌. 2030 నాటికి మొబిలిటీ సొల్యూషన్‌ల అవసరాల మేరకు దాదాపు 40 కోట్ల మంది కస్టమర్‌లతో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా అవతరించే అవకాశం ఉంది.

ఇండియా(India) ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద కార్‌ మార్కెట్‌. 2030 నాటికి మొబిలిటీ సొల్యూషన్‌ల అవసరాల మేరకు దాదాపు 40 కోట్ల మంది కస్టమర్‌లతో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా అవతరించే అవకాశం ఉంది. పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాల్లో భాగంగా పెరుగుతున్న ఆటోమొబైల్ కస్టమర్ల సంఖ్యను ఇండియా తగ్గించనుంది. ఇంధనాల వినియోగం క్రమంగా తగ్గనుంది. అందుకే భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల(EV-Electric Vehicles)ను మరింతగా ప్రోత్సహిస్తోంది. దీర్ఘకాలంలో భారతదేశ ఇంధన దిగుమతులు భారీగా తగ్గించడమే కాకుండా పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పే దిశగా ఇండియా అడుగులు వేస్తోంది. ఇండియా చొరవను ఇతర అభివృద్ది చెందుతున్న దేశాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి.

2030 నాటికి 50 శాతం పునరుత్పాదక ఇంధనం
భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరగనుందనే అంశాన్ని ఆటోమోటివ్‌ నిపుణులు, ప్రజలు అంగీకరిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన ఒప్పందం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ఇండియా ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది. 2030 నాటికి కనీసం విక్రయించే వాహనాల్లో కనీసం 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌వి ఉండాలనే లక్ష్యంతో ఉన్న వరల్డ్‌ EV30@30 ప్రచారానికి మద్దతిచ్చే కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి.

గ్లాస్గో సమ్మిట్‌లో భారతదేశం వివిధ ఆలోచనలను ప్రతిపాదించింది. భారతదేశ ఇంధన అవసరాలలో 50 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని అందించడం, 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, 2070 నాటికి నెట్‌ జీరో సాధించడం వంటివి ఉన్నాయి.

eSIM: రెండు సిమ్‌కార్డులు ఒక్క‌దాంట్లోనే.. ఆండ్రాయ‌డ్ 13 కొత్త వ‌ర్ష‌న్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌

భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రీమోడల్డ్‌ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌(FAME II) స్కీమ్, ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెన్‌టివ్‌(PLI) స్కీమ్‌ ఫర్‌ అడ్వాన్స్డ్‌ కెమిస్ట్రీ సెల్‌(ACC) ఫర్‌ ద సప్లైర్‌ సైడ్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మ్యానుఫాక్చరర్స్‌ కోసం ఆటో అండ్‌ ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ కోసం పీఎల్‌ఐ స్కీమ్‌ వంటివి అందుబాటలోకి తీసుకొచ్చింది.

* తగ్గనున్న ఇంధన అవసరాలు
మొత్తం అవసరాలలో 80 శాతానికి పైగా దాదాపు 100 బిలియన్ల డాలర్ల విలువైన ముడి చమురు ఇండియా దిగుమతి చేసుకొంటోంది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీతో ఇంధనాల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. 2030 నాటికి భారతదేశంలో 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, 40 శాతం బస్సులు , 30 నుంచి 70 శాతం కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు అవుతాయని నీతి ఆయోగ్ తెలిపింది.

2019-2020, 2020-2021 మధ్య ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలు 422 శాతం పెరిగాయని, 2022 మార్చిలో రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో పేర్కొన్నారు. మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు 230 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య కూడా 1,200 శాతానికి పైగా పెరిగింది. ఎలక్ట్రిక్‌ వాహనాలు అదనంగా అనేక గ్రిడ్ మద్దతు సేవల ద్వారా గ్రిడ్‌ను బలోపేతం చేస్తాయని, సురక్షితమైన, స్థిరమైన గ్రిడ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తూ అధిక పునరుత్పాదక శక్తి వ్యాప్తికి సహాయపడతాయని భావిస్తున్నారు.

Smart Phone Tips: మీరు ఈ బ్రాండ్ ఫోన్‌లు వాడుతున్నారా.. ఎక్కువ కాలం వాడాలంటే ఈ విష‌యం తెలుసుకోండి

* బ్యాటరీ తయారీ, నిల్వ అవకాశాలు
ఆధునిక కెమిస్ట్రీ బ్యాటరీలు అవసరమయ్యే మొబైల్ ఫోన్‌లు, UPS, ల్యాప్‌టాప్‌లు, పవర్ బ్యాంక్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది అధునాతన బ్యాటరీల తయారీని 21వ శతాబ్దపు అతిపెద్ద ఆర్థిక అవకాశాలలో ఒకటిగా మార్చింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్‌ని 3 కి.మీ గ్రిడ్‌లో, హైవేలకు ఇరువైపులా ప్రతి 25 కి.మీ.ల వద్ద ఉండాలని నిర్దేశించింది. మోడల్ బిల్డింగ్ బై-లాస్ 2016 (MBBL) ప్రకారం భారతదేశ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. నివాస, వాణిజ్య భవనాలలో EV ఛార్జింగ్ సౌకర్యాల కోసం పార్కింగ్ స్థలంలో 20 శాతం కేటాయించడం తప్పనిసరి చేసింది.

* ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై ప్రోత్సాహకాలు
భారత ప్రభుత్వం అంబ్రెల్లా FAME 2 పథకం కింద అనేక ప్రోత్సాహకాలను అందించింది. భారతదేశంలో ఇప్పుడు EVల కోసం అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రూ.32,000, ఎలక్ట్రిక్ కార్లకు రూ.3 లక్షలు, బస్సులకు రూ. 35-55 లక్షల రాయితీ ఉంది. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై అదనపు ఆదాయపు పన్ను రాయితీ కల్పిస్తోంది. CEEW సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ (CEEW-CEF) అధ్యయనం ప్రకారం.. మార్కెట్‌లో రూ.14,42,000 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందని, అన్ని వాహనాల విభాగాలలో EV అమ్మకాలు 100 మిలియన్ యూనిట్లకు పైగా పెరుగుతాయని అంచనా వేసింది.
Published by:Veera Babu
First published:

Tags: Bikes, Business, Cars, Electric Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు