Electric Car | బిల్డ్ యువర్ డ్రీమ్స్ (బీవైడీ) తాజాగా అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఆటో ఎక్స్‌పో 2023లో కొత్త ఎలక్ట్రిక్ కారును (Car) ప్రదర్శించింది. దీని పేరు బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు (EV). కంపెనీ నుంచి భారత్ మార్కెట్‌లోకి రానున్న మూడో మోడల్ ఇది కావడం గమనార్హం. ఇప్పటికే కంపెనీ బీవైటీ అట్టో 3, బీవైడీ ఇ6 అనే కార్లను దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. బీవైడీ సీల్ అనేది మూడో కారు.
ఓసెన్ ఎక్స్ కాన్సెప్ట్ ద్వారా ఈ కారు డిజైన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కారులో ర్యాడికల్ డిజైన్, ఆల్ గ్లాస్ రూఫ్, స్ల్పిట్ హెడ్ లైట్, బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే కారు వెనుక భాగంలో బీవైడీ సీల్ ఈవీలో ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును రెండో త్రైమాసికంలో మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే కారు డెలివరీ అక్టోబర్ నుంచి ప్రారంభం కావొచ్చు.
లోన్ తీసుకునే వారికి బ్యాంకుల బంపరాఫర్.. చౌక వడ్డీకే రుణాలు!
అంతేకాకుండా దేశీ మార్కెట్‌లోకి మరిన్ని మోడళ్లను తీసుకువచ్చే యోచనలో కంపెనీ ఉంది. బీవైడీ సీల్‌లో ప్రత్యేకమైన డిజైన్ ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. ఏరో డైనమిక్ షేప్, స్లీక్ ఫ్రంట్ ఎండ్, స్టైలిష్ హెడ్‌లైట్స్ వంటివి ఉన్నాయి. అలాయ్ వీల్స్ విత్ డైమండ్ కట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌తో కారు అందం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. పండుగ ముందు దిగివచ్చిన గోల్డ్ రేట్లు!
ఇంకా ఇందులో 15.6 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఆ కారు 700 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. టెస్లా మోడల్ 3 వంటి కార్లకు ఈ కొత్త మోడల్ గట్టి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే హ్యుందాయ్ ఐయానిక్ 5 కారుకు కూడా ఇది కొత్త మోడల్ పోటీ ఇవ్వనుంది. ఈ ఐయానిక్ 5 కారు ఒక్కసారి చార్జింగ్ పెడితే 630 కిలోమీటర్లు వెళ్తుంది.
అంతేకాకుండా ఈ కొత్త బీవైడీ సీల్ కారులో బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని అమర్చినట్లు కంపెనీ పేర్కొంటోంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ 61.4 కేడబ్ల్యూహెచ్ యూనిట్, రెండోది 82.5 కేడబ్ల్యూహెచ్ యూనిట్ ప్యాక్. 61.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 550 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. అలాగే 82.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ రేంజ్ 700 కిలోమీటర్లు. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.8 సెకన్లలోనే అందుకుంటుంది. కాగా ఈ కారు ధర ఎంత ఉంటుందో తెలీదు. అయితే రూ. 60 లక్షల దాకా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Cars, E cars, Electric cars, Electric Vehicles