Home /News /business /

Electric Two-Wheelers: మూడు ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ చేసిన స్టార్టప్

Electric Two-Wheelers: మూడు ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ చేసిన స్టార్టప్

Electric Two-Wheelers: మూడు ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ చేసిన స్టార్టప్

Electric Two-Wheelers: మూడు ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ చేసిన స్టార్టప్

Electric Two-Wheelers | ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్ కొమాకి ఇండియాలో మూడు టూవీలర్లను లాంఛ్ చేసింది. వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి.

భారత మార్కెట్‌లో, ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రంగంలోకి కొత్త స్టార్టప్ కంపెనీలు అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతో భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ సంస్థ కొమాకి మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా టిఎన్ 95, ఎస్‌ఈ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఎం 5 అనే ఎలక్ట్రిక్ బైక్ను కూడా లాంఛ్ చేసింది. కాగా, టిఎన్ 95 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో ధర రూ.98,000. ఎస్‌ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.96,000లకు లభిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో లాంఛ్ అయిన ఎం5 ధర రూ.99,000.

కొమాకి టిఎన్ 95


కొమాకి టిఎన్ 95 వేరియంట్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా విడుదల అవుతుంది. ఈ స్కూటర్‌లో ఎక్స్ట్రా స్టోరేజ్ బాక్స్ను కూడా అందించారు. ఈ స్టోరేజ్ బాక్స్ వాహనం వెనుక భాగంలో మెటాలిక్ గార్డుతో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ -స్కూటర్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే100 నుండి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది ఫుల్ కలర్ డిజిటల్ డిస్ప్లే, పార్క్, రివర్స్ అసిస్ట్, ఆన్-బోర్డు క్రూయిజ్ కంట్రోల్, సెల్ఫ్-డయాగ్నసిస్ స్విచ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో లిథియం- అయాన్ బ్యాటరీని కూడా పొందుపర్చారు. అయితే, ఈ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు కోమాకి కంపెనీ.

Extra Income: జీతం సరిపోవట్లేదా? ఈ 11 మార్గాల ద్వారా మరింత డబ్బు సంపాదించండి

LIC Jeevan Umang Plan: రోజూ రూ.199 పొదుపు చేస్తే రూ.94 లక్షలు మీ సొంతం

కొమాకి ఎస్‌ఈ


కొమాకి నుంచి విడుదలైన రెండో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోమాకి ఎస్ఈ. ఇది సాలిడ్ బ్లూ, మెటాలిక్ గోల్డ్, జెట్ బ్లాక్, గార్ణెట్ రెడ్ వంటి నాలుగు రంగుల్లో ప్రవేశపెట్టబడింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. దీని ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లను పొందుపర్చింది. అన్ని వయసుల వారిని ఆకర్షించేలా కోమాకి SE ను రూపొందించింది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పార్కింగ్, రివర్స్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, సెల్ఫ్ డయాగ్నసిస్, ఫుల్ కలర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... ఈ 9 పాయింట్స్ మర్చిపోవద్దు

Voter ID Correction: మీ ఓటర్ ఐడీ కార్డులో తప్పులున్నాయా? 5 నిమిషాల్లో సరిచేయండిలా

కొమాకి ఎం 5


ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు కంపెనీ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లిథియం- అయాన్ బ్యాటరీతో వస్తుంది. కోమాకి ఎం 5 ఎలక్ట్రిక్ బైక్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 నుండి 120 కిలోమీటర్ల ప్రయాణించగలదు. ఇది బంగారం, వెండి రంగులలో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రధానంగా యువతను ఆకట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Electric Bikes, Electric vehicle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు