Home /News /business /

ELECTRIC SCOOTERS ARE ELECTRIC VEHICLES SAFE CONCERN AMONG CONSUMERS OVER A SERIES OF FIRES GH VB

Electric Scooters: ఎలక్ట్రిక్‌ వాహనాలు సురక్షితమేనా.. వరుస అగ్నిప్రమాదాలతో వినియోగదారుల్లో ఆందోళన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈవీ తయారీ రంగానికీ కొన్ని సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా ప్రాణాంతకమైన అగ్ని ప్రమాదాలు తలెత్తే సమస్య ముందుంటుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం కొత్తకాకపోయినా.. ఇటీవల చోటు చేసుకొన్న రెండు వరుస ఘటనలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

ఇంకా చదవండి ...
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) డిమాండ్‌ పెరుగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలతో, పర్యావరణ పరిరక్షణ కారణాలతో ఎక్కువ మంది ఈవీల(EVs) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో పెట్టుబడులు(Investments) పెట్టాయి. అయితే ఇతర అన్ని రంగాల తరహాలోనే ఈవీ తయారీ రంగానికీ కొన్ని సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా ప్రాణాంతకమైన అగ్ని ప్రమాదాలు(Fire Accidents) తలెత్తే సమస్య ముందుంటుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం కొత్తకాకపోయినా.. ఇటీవల చోటు చేసుకొన్న రెండు వరుస ఘటనలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రతపై(Security) సందేహాలు తలెత్తుతున్నాయి.

ఒక సంఘటనలో Ola Electric సంస్థకి చెందిన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రోడ్డు పక్కన నిలిపి ఉన్న సందర్భంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందరి దృష్టి Ola Electric వైపు మళ్లింది. మరొక సంఘటనలో ఒకినావా ఆటోటెక్ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ లేదా ఛార్జింగ్ ఉపకరణం కారణంగా సంభవించిన మంటల్లో చిక్కుకొన్న తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.

పెరుగుతున్న పోటీ
ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విభాగంలో పోటీ పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ రాయితీల కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు జనాదరణ పొందుతున్నాయి. పోల్ పొజిషన్ కోసం ననెలకొన్న పోటీ దాదాపు అవాస్తవ డెలివరీ టైమ్‌లైన్‌లకు దారి తీస్తోంది. తయారీదారులు కూడా "సెగ్మెంట్-ఫస్ట్" ఫీచర్లను అందించడం ద్వారా పోటీలో నెగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణాలు వాహనం యొక్క నాణ్యత, భద్రత వంటి ఇతర ముఖ్యమైన అంశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇతర మార్కెట్‌లతో పోల్చినప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రత్యేకమైన వాతావరణం ఎదురవుతుంది. ఉపఖండంలో పెరుగుతున్న వేడి భారతదేశంలోని కొన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారులకు పరీక్ష లాంటిది.

Xiaomi Mi Pad 5: షియోమి నుంచి త్వరలోనే ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్​ లాంచ్​.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు..


కంపెనీలు ఏమంటున్నాయి?
తాజా అగ్ని ప్రమాదాలపై భారతదేశంలోని కొన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు స్పందించాయి. Magenta ఎండీ, సీఈవో మాక్సన్‌ లూయిస్‌ మాట్లాడుతూ..‘ఎలక్ట్రిక్ వాహనాలలో పూర్తిగా సురక్షితమైన సాంకేతికతను వినియోగిస్తున్నాం. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌ల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా. చాలా మంది వినియోగదారులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇండియాలో వేడి, తేమ, హార్మోనిక్స్, మనుషులనే నాలుగు ప్రధాన కారణాల వల్ల అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాలను భారతదేశంలో అమలు చేయలేరు. ఇటీవలి ప్రమాదాలకు రెండు కారణాలను పేర్కొనవచ్చు.

ఒకటి సాంకేతికపరమైంది. రెండోది సామాజిక ఆర్థిక పరిస్థితులు. బ్యాటరీని పూర్తిగా పరిశీలించకపోవడం, తప్పుడు ఛార్జింగ్‌ పరికరం వినియోగం, త్వరగా మార్కెట్‌లోకి వాహనం లాంచ్‌ చేయాలనే తొందర.. ఈ కారణాలతోనే ఆయా కంపెనీలు భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఈ వైఖరి వల్ల కంపెనీలు భద్రత, ఫీల్డ్ టెస్టింగ్‌పై షార్ట్‌కట్‌లను తీసుకోవడానికి కారణమవుతున్నాయి.’ అని చెప్పారు.

ఇలాంటి భయానక పరిస్థితులను నివారించడానికి కంపెనీలు కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తాయి. మెజెంటా EVకి HPCL మద్దతు ఉన్నందున భద్రతకు దాని ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తాము కొన్ని భారతీయ బ్యాటరీ తయారీదారులతో కలిసి పనిచేస్తున్నామని క్రేయాన్ మోటార్స్ పేర్కొంది. వారు మెరుగైన బ్యాటరీ సంరక్షణ, మెరుగైన బ్యాటరీ లైఫ్ కోసం కస్టమర్ ఎడ్యుకేషన్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.
Published by:Veera Babu
First published:

Tags: Business, E scootor, Electric Bikes, Ola bikes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు