హోమ్ /వార్తలు /బిజినెస్ /

LML Star: మరే స్కూటర్‌లో లేని ఫీచర్లతో అదరగొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓ లుక్కేయండి!

LML Star: మరే స్కూటర్‌లో లేని ఫీచర్లతో అదరగొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓ లుక్కేయండి!

LML Star: మరే స్కూటర్‌లో లేని ఫీచర్లతో వావ్ అనిపిస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓ లుక్కేయండి!

LML Star: మరే స్కూటర్‌లో లేని ఫీచర్లతో వావ్ అనిపిస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓ లుక్కేయండి!

e-Scooter | మరే ఇతర స్కూటర్‌లో లేని ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త స్కూటర్ వచ్చేస్తోంది. ఇప్పటికే కంపెనీ ఈ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రిబుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Electric Scooter | మీరు కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సూపర్‌ లుక్‌తో ఒక స్కూటర్ (Scooter) అదరగొడుతోంది. అదిరిపోయే డిజైన్‌తో దుమ్మురేపుతోంది. ఎల్ఎంఎల్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Electric Vehicle) మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఆటో ఎక్స్‌పో 2023లో ఎల్ఎంఎల్ స్టార్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్ సెప్టెంబర్ నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఎల్ఎంఎల్ స్టార్ స్కూటర్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రెండు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఒకో బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం 2 కేడబ్ల్యూహెచ్. ఇవి రిమూవబుల్ యూనిట్లు. కంపెనీ ఈ స్కూటర్ ఎంత దూరం వెళ్తుందో చెప్పలేదు. అయితే నివేదికల ప్రకారం చూస్తే.. ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్లొచ్చని తెలుస్తోంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు ఉండనుంది.

ఫోన్‌పే వాడే వారికి అదిరే శుభవార్త.. క్షణాల్లో రూ.5 లక్షల లోన్, ఇలా అప్లై చేసుకోండి!

ఈ ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు భాగంలో టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉంటాయి. వెనుక భాగంలో మోనో షాక్ అబ్జర్బర్ ఉంటుంది. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో రియర్ బ్రేక్ ఉండనుంది. 12 ఇంచుల టైర్లను అమర్చారు. ఈ స్కూటర్ బరువు 115 కేజీలు. ఇంకా ఇందులో 7 ఇంచుల టీఎఫ్‌టీ క్లస్ట్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. అలాగే ముందు భాగంలో ఇంటరాక్టివ్ డిస్‌ప్లే ఉంది. ఇలాంటి ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం.

ఒక్క రూపాయి కట్టక్కర్లేదు.. ఉచితంగా లభిస్తున్న 8 క్రెడిట్ కార్డులు ఇవే!

ఇంకా ఇందులో రివర్స్ మోడ్, ఎల్ఈడీ లైట్స్, టీపీఎంఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి. 360 వ్యూ కోసం ముందు భాగంలో ఒక కెమెరా, వెనుక భాగంలో మరో కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్ ధర రూ. 1.5 లక్షల దాకా ఉండొచ్చని తెలుస్తోంది. బ్యాటరీ ప్యాక్‌పై మూడేళ్లు, స్కూటర్‌పై రెండేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఇంకా ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎల్ఎంఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కట్టకుండానే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లోని ఓలా, ఏథర్, ఐక్యూబ్, విదా వంటి మోడళ్లకు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ ఇవ్వొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First published:

Tags: Electric Scooter, Electric Vehicle, Electric Vehicles, Ev scooters, SCOOTER

ఉత్తమ కథలు