Electric Vehicles | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకుంటే మీకు ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooter) అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. రేంజ్, ధర వంటి అంశాల ప్రాతిపదికన ఇస్కూటర్ (Scooter) ఎంపిక ఉండాలి. మనం ఇప్పుడు తక్కువ ధరలో అదిరే రేంజ్ కలిగిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం.
డెల్టిక్ డ్రిక్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి ఉంది. తక్కువ బడ్జెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అనువుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 55,490. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. అలాటే ఈ స్కూటర్ గరిష్ట ధర రూ. 71,990గా ఉంది. వేరియంట్ ప్రాతిదికన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా మారుతుంది. ఇందులో 60.8 వీ 26 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటంది.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం ఎలా? ఇలా చేయండి!
ఇంకా ఇందులో 250 వాట్ పవర్ బీఎల్‌డీసీ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. బ్యాటరీ ప్యాక్‌పై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఒకసారి చార్జ్ చేయడానికి 1.5 నుంచి 2 యూనిట్ల కరెంట్ అవసరం. అంటే రూ.2 ఖర్చుతో 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌లో డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంద. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ముందు భాగంలో హైడ్రాలిక్ టెలీ స్కోపిక్ సన్సెన్షన్, వెనుక భాగంలో హైడ్రాలిక్ స్ప్రింగ్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు.
రూ.1,750 కడితే లక్ష రూపాయల లోన్ పొందొచ్చు! కేంద్రం ఏమంటోందంటే..
ఇంకా డెల్టిక్ డ్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రిమోట్ స్టార్ట్, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యాంటీ థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్, డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ ఓడో మీటర్, సెంట్రల్ లాకింగ్, ఫైండింగ్ మై స్కూటర్, రివర్స్ మోషన్ స్విచ్, కీలెస్ స్టార్ట్ అండ్ స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నాయి. అలాగే ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్, డీఆర్ఎల్ వంటివి కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా హవా కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలానే దుమ్మురేపుతోంది. తర్వాత ఏథర్, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ వంటి కంపెనీలు ఉన్నాయి. బజాజ్ చేతక్ స్కూటర్ కూడా ఆకర్షణీయంగా ఉంది. సూపర్ ఫీచర్లు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicle, Electric Vehicles, Ev scooters, SCOOTER