FAME-II Scheme: ఎలక్ట్రిక్ బైకుకు రూ.20,000, కారుకు రూ.1.5 లక్షల సబ్సిడీ

FAME-II Scheme | మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.20,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. 35,000 ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్లకు రూ.1,50,000, హైబ్రిడ్ ఫోర్ వీలర్‌కు రూ.13,000, ఇ-రిక్షాకు రూ.50,000, ఎలక్ట్రిక్ బస్‌కు రూ.50 లక్షల చొప్పున సబ్సిడీ లభిస్తుంది.

news18-telugu
Updated: March 12, 2019, 3:03 PM IST
FAME-II Scheme: ఎలక్ట్రిక్ బైకుకు రూ.20,000, కారుకు రూ.1.5 లక్షల సబ్సిడీ
FAME-II Scheme: ఎలక్ట్రిక్ బైకుకు రూ.20,000, కారుకు రూ.1.5 లక్షల సబ్సిడీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 12, 2019, 3:03 PM IST
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త. FAME-II స్కీమ్‌లో ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు భారీ సబ్సిడీ లభించనుంది. ఎలక్ట్రిక్ బైకుకు రూ.20,000, కారుకు రూ.1.5 లక్షల చొప్పున ఫేమ్-2 పథకం కింద సబ్సిడీ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ నుంచి ఫేమ్-2 పథకం అమలులోకి రానుంది. ఫేమ్-2 స్కీమ్ మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఫాస్టర్ అడాప్షన్ & మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్(FAME) వెహికిల్స్ రెండో విడత పథకానికి కేంద్రం రూ.10,000 కోట్ల ప్యాకేజీ కేటాయించిన విషయం తెలిసిందే. మూడేళ్లలో మొత్తం రూ.10,000 కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనుంది కేంద్రం. 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు వర్తిస్తుంది.

Read this: SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...

fame india scheme phase 2, fame 2 scheme, fame india scheme, fame 2 subsidy, what is fame india scheme, fame 1 scheme, how to claim fame subsidy, fame 2 scheme pib, FAME II Scheme details, Electric cars India, Electric Vehicles Charging Station India, EV guidelines India, EV India, Electric cars offers, Electric Vehicles deals, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్, ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్
(ప్రతీకాత్మక చిత్రం)


FAME-II స్కీమ్‌లో ఏ వాహనానికి ఎంత సబ్సిడీ?




మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.20,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. 35,000 ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్లకు రూ.1,50,000, హైబ్రిడ్ ఫోర్ వీలర్‌కు రూ.13,000, ఇ-రిక్షాకు రూ.50,000, ఎలక్ట్రిక్ బస్‌కు రూ.50 లక్షల చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇవ్వడంపై ఆటోమొబైల్ రంగం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడమే ఫేమ్-2 స్కీమ్ లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఉపయోగించే అడ్వాన్స్‌డ్ బ్యాటరీలకూ ప్రోత్సాహకాలు ఇవ్వనుంది కేంద్రం. వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా ప్రోత్సహించేందుకు మెట్రోలు, పట్టణాల్లో 2,700 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన పట్టణాలను కలిపే ప్రధాన రహదారుల్లో ప్రతీ 25 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.

2015లో ప్రారంభమైన ఫేమ్-1 పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.895 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ పథకాన్ని ఒక ఏడాది కోసమే అనుకున్నా ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించడం విశేషం. 2019 మార్చి 31 వరకు ఫేమ్-1 పథకమే వర్తిస్తుంది.

Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...
Loading...

ఇవి కూడా చదవండి:

www: వాల్డ్ వైడ్ వెబ్‌కు 30 ఏళ్లు... గూగుల్ స్పెషల్ డూడుల్... ఆసక్తికరమైన 10 అంశాలివే...

Redmi Note 7 Pro: రేపే రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్... JIO నుంచి డబుల్ డేటా, రూ.2,400 క్యాష్‌బ్యాక్

Voter Helpline App: ఓటర్ హెల్ప్‌లైన్ యాప్... ఎలా వాడాలో తెలుసుకోండి
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...