Electric Vehicles: ఎలక్ట్రిక్​ వాహన కొనుగోలుదారులకు గుడ్​న్యూస్​.. ఆ ఛార్జీల నుంచి మినహాయింపు..

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్​ వాహనాల రిజిస్ట్రేషన్​, రెన్యువల్​ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్​ వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్ల జారీకి కూడా ఎలాంటి ఫీజు వసూలు చేయరని మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • Share this:
దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్​ వాహనాల రిజిస్ట్రేషన్​, రెన్యువల్​ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్​ వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్ల జారీకి కూడా ఎలాంటి ఫీజు వసూలు చేయరని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ–స్కూటర్​ లేదా బైక్ కొనుగోళ్లకు అయ్యే ఖర్చు కనీసం రూ. 1000 తగ్గుతుందని ఆటోమొబైల్​ డీలర్స్​​ అసోసియేషన్ పేర్కొంది. తాజా నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో​ ఈ–స్కూటర్లు, ఎలక్ట్రిక్​ కార్ల​ కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, బ్యాటరీ ఆధారంగా నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ జారీ, రెన్యువల్​ ఛార్జీల మినహాయింపుకు సంబంధించి 2020, మే 27న కేంద్రం డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.

అభ్యంతరాలు, సలహాలు ఏమైనా ఉంటే 30 రోజుల్లోపు తెలపాలని వాహనదారులను కోరింది. దీనికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్ర మోటారు వాహనాల చట్టం–1989లో సవరణలు చేస్తూ ఆగస్టు 3న నోటిఫికేషన్ జారీ చేసింది.​ ఇప్పటికే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలను రెట్టింపు చేశాయి. FAME II పథకంలో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాల కొనుగోళ్లపై రెట్టింపు సబ్సిడీ అందిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు దాదాపు సగానికి తగ్గాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు మరో 20 రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియలో పాలసీని సిద్ధం చేస్తున్నాయి.

పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరల నుంచి వాహనదారులకు ఊరటనిచ్చేందుకు, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ–వాహనాలపై పన్నులు తగ్గించడం, FAME II పథకం ద్వారా ప్రోత్సాహకాలను అందించడం, ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు చొరవ తీసుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోళ్లు పెరుగుతాయని కేంద్రం భావించినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. దేశంలో సరైన మౌలిక సదుపాయాలు, ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు విరివిగా లేకపోవడం ఎలక్ట్రిక్​ వాహనాల వృద్ధికి సవాలుగా మారింది.
Published by:Veera Babu
First published: