ELECTRIC CAR A MERCEDES BENZ EV CAR THAT TRAVELS 1000 KM ON A SINGLE CHARGE TESLA ELECTRIC RECORD BREAK GH VB
Electric Car: సింగిల్ ఛార్జ్‌తో 1,000 కిలోమీటర్లు.. ఈ EV Car మాములుగా లేదుగా..
ప్రతీకాత్మక చిత్రం
మెర్సిడెస్ బెంజ్ ఏజీ (Mercedes-Benz AG) ఎలక్ట్రిక్ కారు జర్మనీ నుంచి ఫ్రెంచ్ రివేరా వరకు 1,000 కిలోమీటర్లు (621 మైళ్ళు) ఒకే ఛార్జ్‌తో ప్రయాణించింది. ట్రిప్ పూర్తయిన తర్వాత కూడా ఈ కారులో 15% ఛార్జింగ్ మిగిలి ఉందట. ఈ ఛార్జింగ్ తో మరొక 80 మైళ్లు ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) హవా నడుస్తోంది. వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. ఈవీ కార్ల విషయానికి వచ్చేసరికి, వాహనదారులు రేంజ్ (Range)కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కార్లు సింగిల్ ఛార్జ్ (Single Charge)పై గరిష్ఠంగా 1,000 కిలోమీటర్ల కంటే తక్కువ రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి. అయితే తాజాగా జర్మన్ కంపెనీకి చెందిన ఒక కారు సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 1,000 కిలోమీటర్లు ప్రయాణించి వరల్డ్ రికార్డు సృష్టించింది. మెర్సిడెస్ బెంజ్ ఏజీ (Mercedes-Benz AG) ఎలక్ట్రిక్ కారు జర్మనీ(Germany) నుంచి ఫ్రెంచ్ రివేరా వరకు 1,000 కిలోమీటర్లు (621 మైళ్ళు) ఒకే ఛార్జ్‌తో ప్రయాణించింది. ట్రిప్ పూర్తయిన తర్వాత కూడా ఈ కారులో 15% ఛార్జింగ్ మిగిలి ఉందట. ఈ ఛార్జింగ్ తో మరొక 80 మైళ్లు ప్రయాణించవచ్చు. ఇలా చూసుకుంటే టెస్లా ఎలక్ట్రిక్‌కార్ల రేంజ్(Electric Cars Range) కంటే ఇది చాలా ఎక్కువేనని చెప్పవచ్చు.
తన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు విజన్ ఈక్యుఎక్స్ఎక్స్ (Vision EQXX) సింగిల్ ఛార్జ్‌తో 1,000 కి.మీల విజయవంతంగా ప్రయాణించినట్లు మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది. ఈ వాహనం సగటున గంటకు 54 మైళ్ల వేగంతో ప్రయాణించింది. స్టుట్గార్ట్ సమీపంలోని సిండెల్ఫింగెన్ స్విట్జర్లాండ్, ఇటలీ మీదుగా మధ్యధరా తీరప్రాంత పట్టణం కాసిస్కి తమ వెహికల్ చేరుకుందని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ గురువారం తెలిపింది. మెర్సిడెస్ మొదటిసారిగా విజన్ EQXXని పవర్ ఫుల్ బ్యాటరీతో ఒక ప్రయోగంగా ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది. తేలికపాటి చట్రం (Chassis), ఏరోడైనమిక్ ప్రొఫైల్ సాయంతో ఈ కారు 12 గంటల నాన్ స్టాప్ ట్రిప్ ని పూర్తి చేయగలిగింది. తేలికపాటి మెటీరియల్స్, స్లిప్పరీ బాడీ డిజైన్, అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ, ఎఫ్1-ఇన్స్పైర్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్, ఏరోడైనమిక్ టైర్లు ఒక కారులో జోడిస్తే లాంగ్ రేంజ్ సాధ్యమేనని మెర్సిడెస్ నిరూపించింది.
అత్యంత ప్రభావవంతమైన మెర్సిడెస్ కార్లలో EQXX మోడల్ కారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓలా కల్లెనియస్ తెలిపారు. మెర్సిడెస్ కంపెనీ 65 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి 2026 నాటికి టెస్లాని అధిగమించాలని యోచిస్తోంది. అంతేకాదు ప్రపంచంలో అత్యధికంగా లగ్జరీ-కార్ల సేల్ చేస్తున్న తయారీ సంస్థగా ఓ టైటిల్‌ను గెలిచి BMW AG కి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. 2030 నాటికి సాధ్యమైన చోట మాత్రమే ఈవీలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భాగస్వాములతో ఎనిమిది బ్యాటరీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఈ సంస్థ మెర్సిడెస్ EQS కార్లను లాంచ్ చేయడం ద్వారా ఈవీ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మెర్సిడెస్ ఈ సంవత్సరం ఆల్-ఎలక్ట్రిక్ EQE సెడాన్... EQB స్పోర్ట్-యుటిలిటీ వెహికల్తో దాని ఈవీల సంఖ్యను మరింతగా పెంచుతోంది. ఈవీ షిప్మెంట్ల విషయానికి వస్తే... టెస్లా ఇప్పటికీ ముందుంది.
* రేసింగ్ టెక్నాలజీ
EQXXతో ఎలక్ట్రిక్ టెక్నాలజీలో తానే బెస్ట్ అని నిరూపించడానికి మెర్సిడెస్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ మోడల్ గంటకు గరిష్ఠంగా 87 మైళ్ల (దాదాపు 140 కిలోమీటర్లు) వేగంతో ట్రిప్ పూర్తి చేసింది. యూకేలోని Mercedes-AMG హై పెర్ఫార్మెన్స్ పవర్‌ట్రెయిన్స్ విభాగానికి చెందిన ఫార్ములా వన్ నిపుణుల సహాయంతో న్యూ కెమిస్ట్రీ గల బ్యాటరీని ఈ కారు కోసం డెవలప్ చేశారు. 2024 నుండి మెర్సిడెస్ కాంపాక్ట్‌లో సెల్‌లను అమర్చాలనేది కంపెనీ ప్లాన్.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.