EMI | మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయానలి ప్లాన్ చేస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లోన్ (Loan) తీసుకొని ఎలక్ట్రిక్ బైక్ (Bike) కొనుగోలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. దీని వల్ల లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే వారిపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ బైక్ కొన్న వారు ప్రతి నెలా కచ్చితంగా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే మాత్రం సమస్య వస్తుంది. మీ ఎలక్ట్రిక్ బైక్ షట్ డౌన్ అవుతుంది. అంటే ఫోన్‌లో చార్జింగ్ లేకపోతే ఎలా అయితే ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుందో.. అలానే మీరు ఈఎంఐ కట్టకపోతే.. మీ బైక్ కూడా స్విచ్ఛాఫ్ అవుతుంది. అప్పుడు మీరు మీ ఎలక్ట్రిక్ బైక్‌ను నడపలేదు. అలానే పక్కన పెట్టాల్సి రావొచ్చు.
బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట.. దిగొచ్చిన ధరలు, షాకిచ్చిన వెండి!
ఈవీ స్టార్టప్ రెవోల్ట్ మోటార్స్ కొత్త టెక్నాలజీని తీసుకువస్తోంది. ఎలక్ట్రిక్ బైక్స్‌ను రిమోట్ కంట్రోల్ ద్వారా షట్ డౌన్ చేసే టెక్నాలజీని రూపొందించింది. బైక్ ఓనర్ నెలవారీ ఈఎంఐ కట్టకపోతే.. అప్పుడు వారి బైక్‌ను రిమోట్ కంట్రోల్ ద్వారా షట్ డౌన్ చేస్తారు. దీని కోసం కంపెనీ తన ఎలక్ట్రిక్ బైక్‌లో చిప్‌ను అమర్చనుంది. రివోల్ట్ ఆర్‌వీ సిరీస్‌లో వీటిని అమరుస్తోంది. దీని వల్ల బైక్‌ను పూర్తిగా పనిచేయకుండా చేయొచ్చు.
ఉద్యోగులకు మోదీ అదిరిపోయే ఉగాది కానుక.. ఈ రోజు కీలక ప్రకటన?
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రట్టన్ ఇండియా ఈ రివోల్ట్ బైక్స్‌కు ఫైనాన్స్ సదుపాయం అందిస్తోంది. ఎవరైతే లోన్ తీసుకొని రివోల్ట్ బైక్ కొంటున్నారో.. అలాంటి బైక్స్ అన్నింటిలోనూ ఈ చిప్‌ను పెడతారు. ఒకవేళ కస్టమర్లు ఈ చిప్‌ను తీసేయాలని ప్రయత్నిస్తే.. బైక్ ఆటోమేటిక్‌గానే పని చేయకుండా షట్ డౌన్ అవుతుంది. అందువల్ల కస్టమర్లు రివోల్ట్ బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే మాత్రం ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రతి నెలా కచ్చితంగా ఈఎంఐ కట్టాలి. కాగా మీరు ఈ రివోల్ట్ బైక్‌ను రూ. 5717 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. మిగతా మొత్తాన్ని లోన్ ద్వారా చెల్లించాలి. కాగా ఈ బైక్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా లాక్, అన్‌లాక్, స్టార్ట్, స్టాప్, లొకేషన్, జియో ఫెన్స్, డిస్‌ప్లే బ్యాటరీ స్టేటస్ వంటి ఫీచర్లు పొందొచ్చు. కాగా ఈ బైక్ రేంజ్ 150 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 0 నుంచి 100 శాతం బ్యాటరీ 4.5 గంటల్లో ఫుల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, E bike, Electric bike, Electric Vehicle, Personal Loan