హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hop OXO: ఎలక్ట్రిక్ బైక్ అదరహో! 150 కి.మి రేంజ్, కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చు, రూ.999తో బుక్ చేసుకోండి!

Hop OXO: ఎలక్ట్రిక్ బైక్ అదరహో! 150 కి.మి రేంజ్, కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చు, రూ.999తో బుక్ చేసుకోండి!

Hop OXO: కిలోమీటర్‌కు 25 పైసలు ఖర్చు.. దుమ్మురేపుతోన్న ఎలక్ట్రిక్ బైక్, ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మి వెళ్లొచ్చు!

Hop OXO: కిలోమీటర్‌కు 25 పైసలు ఖర్చు.. దుమ్మురేపుతోన్న ఎలక్ట్రిక్ బైక్, ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మి వెళ్లొచ్చు!

Electric Vehicle | మీరు కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం సూపర్ మోడల్ ఒకటి అందుబాటులో ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

e-Bike |కొత్త బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా కొత్త ఎలక్ట్రిక్ బైక్ (Bike) కొనుగోలు చేస్తే మంచిదని ఆలోచిస్తున్నారా? అయితే ఒక అదిరిపోయే మోడల్ అందుబాటులో ఉంది. చూడటానికి సూపర్ లుక్‌తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) అందరినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ అది ఏ బైక్ అని అనుకుంటున్నారా? ఒక్సో హోప్. ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఒక కిలోమీటర్‌కు 25 పైసలు ఖర్చు అవుతుందని తెలియజేస్తోంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. ఇక ఈ బైక్ ధర విషయానికి వస్త.. రూ. 1,39,999 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బైక్ గరిష్ట ధర రూ. 1.6 లక్షల వరకు ఉంది.

లైసెన్స్ అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఉండదు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మి వెళ్లొచ్చు!

ఈ బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు కేవలం రూ. 999తో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్లాక్, గ్రే, యెల్లో, బ్లూ, రెడ్ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ బైక్2ను హోప్ న్యూరాన్ అప్లికేషన్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. బైక్ చార్జింగ్ స్టేటస్, రేంజ్, బైక షోరూమ్ ఇలా చాలా ఫీచర్లు దీని ద్వారా పొందొచ్చు. ఈ బైక్ రెండు వేరియంట్ల రూపంలోలభిస్తోంది.

బంపరాఫర్.. రూ.7 లక్షల ట్రాక్టర్ ఫ్రీ, ఉచితంగా 8 గ్రాముల బంగారం.. ఎలా పొందాలంటే?

ఒక్సో, ఒక్కో ప్రో ప్యాకేజ్ అనేవి ఇవి. ఒక్సోలో 72 వీ బ్యాటరీ ఉంటుంది. 3 కేడబ్ల్యూ మోటార్ అమర్చారు. బీఎల్‌డీసీ హబ్ మోటార్ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ కావడానికి ఐదు గంటలు పడుతుంది. 5 ఇంచుల స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఐపీ 67 రేటింగ్ ఉంది. టెయిల్ లైట్ ,ఇండికేటర్లు, డేటైమ్ రన్నింగ్ లైట్స్, హెడ్‌లైట్ వంటివి ఉన్నాయి. వెహికల్‌పై 3 ఏళ్లు, బ్యాటరీపై 4 ఏళ్లు, మోటార్‌పై 3 ఏళ్లు వారంటీ వస్తుంది. దీని రేంజ్ 135 కిలోమీటర్లు.

ఇక ప్రో వేరియంట్‌లో అయితే దాదాపు ఇవే ఫీచర్లు ఉంటాయి. రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే ఇందులో ఇంటర్నెట్, జీపీఎస్, బ్లూటూత్, సెక్యూరిటీ, మొబైల్ యాప్ వంటి ఫీచర్లు ఉంటాయి. అంటే స్మార్ట్ ఫీచర్లు ప్రో వేరియంట్‌లోనే అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదుబాటు ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారు ఈ ఆప్షన్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

First published:

Tags: E bike, Electric bike, Electric Bikes, Electric Vehicle, Electric Vehicles

ఉత్తమ కథలు