Stock Market: ఆ షేర్ వేల్యూ 6 రూపాయలే.. కానీ రూ.1 లక్ష చెల్లించేందుకు సిద్ధం...ఎందుకంత డిమాండ్...

కేవలం రూ.6 రూపాయలు విలువ చేసే ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే పెన్నీ స్టాక్ కొనేందుకు బయ్యర్లు ఒక్కో షేరుకు ఏకంగా 15000 రెట్ల ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.

news18-telugu
Updated: April 5, 2019, 6:43 PM IST
Stock Market: ఆ షేర్ వేల్యూ 6 రూపాయలే.. కానీ రూ.1 లక్ష చెల్లించేందుకు సిద్ధం...ఎందుకంత డిమాండ్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 5, 2019, 6:43 PM IST
సాధారణంగా పెన్నీ స్టాక్స్ అనగానే మదుపరులు లాటరీ టిక్కెట్లుగా భావిస్తుంటారు...తగిలితే లక్కు...అనే కాన్సెప్ట్ తో తెగ కొనేస్తుంటారు. ముఖ్యంగా ఒక రూపాయి నుంచి పదిరూపాయల మధ్య ఉండే పెన్నీ స్టాక్స్ బల్క్‌గా కొని పావలా, అర్థ రూపాయి పెరిగినా..ఇంట్రాడేలోనూ, లేదంటే షార్ట్ టర్మ్ లోనూ అమ్మేసి లాభాలు మూటగట్టుకోవడం కొందరు ఇన్వెస్టర్లకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఫండమెంటల్ పరంగా చూస్తే ఇలాంటి స్టాక్స్ కు దూరంగా ఉండటమే మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. కానీ ఒక స్టాక్ విషయంలో మాత్రం మొత్తం ఈ థియరీ తప్పుగా భావిస్తున్నారు. అంతే కాదు కేవలం రూ.6 రూపాయలు విలువ చేసే ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే పెన్నీ స్టాక్ కొనేందుకు బయ్యర్లు ఒక్కో షేరుకు ఏకంగా 15000 రెట్ల ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు ఈ ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ కంపెనీ ఏటా రూ. 15 డివిడెండ్ చెల్లించడం విశేషం. కాగా ఈ స్టాక్‌కు సెల్లర్స్ ఎప్పుడూ ఉండరు.. అంతే కాదు ట్రేడింగ్ కూడా చోటు చేసుకోదు. దీంతో అటు ఇన్వెస్టర్లతో పాటు ఎక్స్‌చేంజీలకు కూడా ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక తలనొప్పిగా మారింది.

నిజానికి ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ షేర్ కోసం ఇంత డిమాండ్ ఎందుకు ఉంది.. అంటే మాత్రం దీని బ్యాక్ గ్రౌండ్..కంపెనీ వివరాలు తెలసుకోవాల్సిందే...ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ అనేది ఒక మైక్రోక్యాప్ కంపెనీ.. కానీ మార్కెట్ దిగ్గజం బ్లూచిప్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్‌గా ఉంది. అంతే కాదు ఏషియన్ పేయింట్స్ సంస్థలో సుమారు 2.83 కోట్ల ఈక్విటీ షేర్లు ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సొంతం చేసుకుంది. అంటే సుమారు 2.95 శాతం వాటాతో సమానం కాగా, మార్కెట్ క్యాపిటల్ పరంగా చూస్తే ఇది రూ.4200కోట్లతో సమానం. ఇంత విలువైన కంపెనీలో వేల కోట్ల వాటాలు కలిగిన ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ మార్కెట్ క్యాప్ ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అక్షరాలా కేవలం రూ.12 లక్షలు మాత్రమే.. కావడం గమనార్హం. అంతే కాదు గడిచిన ఎనిమిది నెలలుగా ఈ కౌంటర్ లో ఎలాంటి ట్రేడింగ్ జరగడం లేదు.

గత సంవత్సరం ఆగస్టు 9, 2018న చివరిసారిగా ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.5.89వద్ద ట్రేడ్ అయ్యింది. కానీ ప్రతీ ఏడాది ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ.15 ల డివిడెండ్ చెల్లిస్తోంది. అంటే షేర్ విలువ కన్నా మూడు రెట్ల డివెండ్ చెల్లిస్తోంది. అయితే ఈ కంపెనీ స్టాక్స్ ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

స్టాక్ అసలు విలువ ఎంత ?


నిజానికి ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ కు చెందిన ఒక్కో షేరు విలువ సుమారు రూ. ఒక లక్ష దాకా ఉంటుందని. ఎస్ఏ ఇన్వెస్ట్‌మెంట్స్ అడ్వైజర్స్ సంస్థ కో ఫౌండర్ అరుణ్ ముఖర్జీ తెలిపారు. అంతే కాదు అయితే ఎవరైనా రూ.లక్ష విలువ చేసే స్టాక్ ను మార్కెట్లో రూ.6కు అమ్ముకుంటారా..అని అసలు కిటుకు చెప్పేసారు.

అయితే ఇంత విలువైన షేర్లను సరైన వాల్యూకు అమ్ముకోవాలని షేర్ హోల్డర్లు సుదీర్ఘ కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈ విషయంలో కలుగచేసుకొని పరిష్కారం చూపాలని స్టేక్ హోల్డర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాల్ ఆక్షన్ నిర్వహించి ఎల్సిడ్ షేర్ల అసలు విలువను పునరుద్ధించాలని కోరారు.

2013లో ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆఫర్ ఫర్ సేల్ ప్రకటించి షేర్ విలువ రూ.5000 గా నిర్ణయించింది. ఎవరైతే రూ.5.89 వద్ద షేర్లను కొనుగోలు చేశారో వారు ముందుకు రావాలని కోరింది. అయినప్పటికీ ఈ ఆఫర్ ను షేర్ హోల్డర్లు రిజెక్ట్ చేశారు. అయితే ఇలాంటి ఎక్స్ ట్రార్డినరీ షేర్లలో ఎక్స్‌చేంజీలు చొరవ తీసుకొని ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడాలని ఢిల్లీకి చెందిన అడ్వైజర్ అశీష్ ఛగ్ తెలిపారు.

అయితే ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్ షేర్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది బ్రోకర్లు ఒక్కో షేరుకు రూ.ఒక లక్షకు పైగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే వారిని సంప్రదిస్తే పని అవుతుందని అరుణ్ ముఖర్జీ అంటున్నారు.

ప్రస్తుతం అమలులో ఉన్న కంపెనీ చట్టాల ప్రకారం ఏషియన్ పెయింట్స్, ఎల్సిడ్ ప్రమోటర్లు కలిసి నిర్ణయం తీసుకుంటే తప్ప ఇన్వెస్టర్ల డబ్బుకు న్యాయం దక్కదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...