Home /News /business /

Elon Musk: ఎలాన్ మాస్క్‌ చేసిన పిచ్చి పనికి టెస్లా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా...

Elon Musk: ఎలాన్ మాస్క్‌ చేసిన పిచ్చి పనికి టెస్లా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా...

ఎలోన్ మస్క్, టెస్లా కంపెనీ అధినేత (FIle)

ఎలోన్ మస్క్, టెస్లా కంపెనీ అధినేత (FIle)

బిట్ కాయిన్ విలువ పెరుగుతుండడంపై ట్విట్టర్ లో వాటి షేర్ ధరల మీద ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు.

ఇంకా చదవండి ...
    ఈమధ్యనే ప్రపంచ కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్.. తాను చేసిన ట్వీట్ వల్ల భారీ నష్టాన్ని చూశారు. అంతకుముందు ప్రపంచ కుబేరుడిగా ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపాదనను మించిపోయిన ఎలాన్ మస్క్.. ఆ స్థానంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్ తో 15.2మిలియన్ల డాలర్ల నష్టపోవడంతో ప్రపంచం కుబేరుడి స్థానాన్ని చేజార్చుకోగా (బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్) జెఫ్ బెజోస్ తిరిగి ప్రపంచ కుబేరుడి స్థానంలో నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ నికర సంపద 183మిలియన్ డాలర్లు కాగా.. బెజోస్ నికర సంపద 186 మిలియన్లుగా ఉంది.

    ఇంతకీ ఏంటా ట్వీట్?:
    ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ల అధినేత ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ల గురించి చేసిన ఓ ట్వీటే అతడి సంపద తగ్గిపోవడానికి కారణం అయ్యింది. ఇటీవల బిట్ కాయిన్ విలువ పెరుగుతుండడంపై ట్విట్టర్ లో వాటి షేర్ ధరల మీద ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు.

    ఎలాన్ మస్క్ ట్వీట్ వల్ల టెస్లా కంపెనీ ఈక్విటీ విలువ పడిపోయింది. దీంతో టెస్లా షేర్ల విలువలో 8.6శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల టెస్లా కంపెనీకి 15.2మిలియన్ డాలర్ల నష్టం(భారత కరెన్సీలో దాదాపు రూ.1.09 లక్షల కోట్ల నష్టం) వాటిల్లింది. కాగా త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

    కాగా గతంలో కూడా ఎలాన్ మస్క్ ఇదే తరహా నష్టాలను చవిచూశారు. అయితే గతంలో ఎన్నడూ లేనంత భారీగా మాత్రం ఈ ఒక్క ట్వీట్ దెబ్బతో నష్టపోవడం విశేషం. సెప్టెంబర్ 2020 తర్వాత ఎలాన్ మస్క్ ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

    బెజోస్ Vs ఎలాన్ మస్క్:
    అటు ఈ ఏడాది జో బెజోస్, ఎలాన్ మస్క్ ల మధ్య ప్రపంచ కుబేరుడి పీఠంకై పోటీ కొనసాగుతోంది. ఎలాన్ మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఒక్క ఆగష్టు నెలలోనే 74మిలియన్ డాలర్ల నుండి 60శాతం పెరిగి దాదాపు 850మిలియన్ డాలర్లను సమీకరించింది. దీంతో జో బెజోస్ స్థానాన్ని ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. అయితే మస్క్ చేసిన ట్వీట్ అతడిని తిరిగి నెంబర్ 2గా చేసింది.

    ప్రపంచ కుబేరుల జాబితా(టాప్ 5)..
    1. జెఫ్ బెజోస్ - 186.3బిలియన్ డాలర్లు
    2. ఎలాన్ మస్క్ - 183.4బిలియన్ డాలర్లు
    3. బిల్ గేట్స్ - 135.3బిలియన్ డాలర్లు
    4. బెర్నార్డ్ అర్నాల్ట్ - 117.6బిలియన్ డాలర్లు
    5. మార్క్ జుకర్ బర్గ్ - 98.9బిలియన్ డాలర్లు
    (Source: బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం)

    ఎలాన్ చేసిన మేలు:
    ఎలాన్ మస్క్ ట్వీట్ల వల్ల ఇప్పుడైతే తన కంపెనీకే నష్టం జరిగినా గతంలో మాత్రం వేరే కంపెనీలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గతంలో బిట్ కాయిన్లకు సంబంధించి ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వల్ల బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరిగిపోయింది. అటు ప్రైవసీ విషయంలో వాట్సాప్ కన్నా సిగ్నల్ ను నమ్మాలి అంటూ పరోక్షంగా మస్క్ చేసిన ట్వీట్ వల్ల సిగ్నల్ కంపెనీకి ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి. ఒక్క క్షణం చాలు జీవితంలో ఏమైనా జరగవచ్చు.. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అనే సామెత ఎలాన్ మస్క్‌కు వర్తిస్తుందని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Elon Musk

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు