ఈ పండుగ సీజన్లో బంగారం కొని లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా గోల్డ్ కొనాలనుకుంటున్నారా? పెళ్లిళ్ల కోసం నగలు కొనే ఆలోచనలో ఉన్నారా? నగల కోసం మీరు ఆ షాపు, ఈ షాపు తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీకు కావాల్సిన నగలను భారీ డిస్కౌంట్‌తో కొనొచ్చు. ఆభరణాలను అమ్ముతున్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ eJOHRI ద్వారా ఇది సాధ్యం. ఈ ఏడాదిలోనే అతిపెద్ద దివాళీ సేల్ రాబోతోంది. జ్యువెల్ ఉత్సవ్ దివాళీ సేల్ పేరుతో అక్టోబర్ 25న దసరా రోజున ఈ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ దివాళీ వరకు ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన నగలను eJOHRI ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చూసుకొని ఆర్డర్ చేయొచ్చు. దేశంలో 130 పట్టణాలు, నగరాల్లోని 300 పైగా స్టోర్లు, 230 పైగా నగల వ్యాపారులు తమ నగలను ఈ ప్లాట్ఫామ్లో డిస్ప్లే చేస్తారు. కస్టమర్లకు 30,000 పైగా డిజైన్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఎన్ని నగలైనా చెక్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇది ఆన్లైన్ సేల్ కాబట్టి ఆన్లైన్లో నగలు కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
Online Gold: ఆన్లైన్లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
LIC new plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ... ఈ ప్లాన్‌తో ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు

ప్రతీకాత్మక చిత్రం
జ్యువెల్ ఉత్సవ్ దివాళీ సేల్‌లో కస్టమర్లకు అనేక ఆఫర్స్ ఉంటాయి. ఫ్లాష్ సేల్‌లో సిల్వర్ కాయిన్స్ కొనొచ్చు. వీటితో పాటు అనేక ప్రొడక్ట్స్‌పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లు గోల్డ్ బులియన్ మార్కెట్లో ఉన్న ధరలకే ఇక్కడ నగలు కొనొచ్చు. ఇక బడాబడా నగల వ్యాపారులు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు తగ్గించనున్నారు. కొన్ని నగలపై మేకింగ్ ఛార్జీలు 100 శాతం వరకు తగ్గించనున్నారు. ఈసారి కరోనా వైరస్ మహమ్మారి అనేక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. నగల వ్యాపారాలపైనా ఆ ప్రభావం ఉంది. అందుకే ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం నగల వ్యాపారులు గతంలో ఎన్నడూ లేనంతగా డిస్కౌంట్స్ ప్రకటిస్తారని అంచనా. నగలు ఆన్లైన్లో కొంటారు కాబట్టి ఆర్డర్ చేసే ముందు అన్ని విషయాలు పరిశీలించుకోవాలి. బంగారం ధర ఎంత, స్టోన్స్ తీసేసి బంగారాన్ని తూకం చేస్తున్నారా లేదా, ఎన్ని క్యారెట్ల నగలు కొంటున్నారు, చెల్లిస్తున్న ఛార్జీలు ఏంటీ, ఆన్లైన్లో కన్నా షాపులో ధర తక్కువ వస్తుందా అన్న విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఆర్డర్ చేయడం మంచిది.
Published by:Santhosh Kumar S
First published:October 23, 2020, 08:49 IST