హోమ్ /వార్తలు /బిజినెస్ /

Education Budget: బడ్జెట్‌లో విద్యారంగం కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Education Budget: బడ్జెట్‌లో విద్యారంగం కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Education Budget: బడ్జెట్‌లో విద్యారంగం కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Education Budget: బడ్జెట్‌లో విద్యారంగం కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Education Budget: నిర్మలమ్మ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువగా రూ.1.2 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. విద్యాభివృద్ధికి, యువతలో నైపుణ్యాభి వృద్ధికి పెద్దపీట వేసేలా కొన్ని సంస్కరణలు ప్రకటించారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యారంగానికి సంబంధించిన వాటిపై జీఎస్టీ (GST) తగ్గించకపోవడంపై కాస్త నిరాశ చెందుతున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నిర్మలమ్మ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో (Budget 2023) విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువగా రూ.1.2 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. విద్యాభివృద్ధికి, యువతలో నైపుణ్యాభి వృద్ధికి పెద్దపీట వేసేలా కొన్ని సంస్కరణలు ప్రకటించారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యారంగానికి సంబంధించిన వాటిపై జీఎస్టీ (GST) తగ్గించకపోవడంపై కాస్త నిరాశ చెందుతున్నారు. అలాగే ఉన్నత విద్యకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇవ్వలేదని మరికొంత మంది అంటున్నారు. బడ్జెట్లో ఎడ్యకేషన్కు సంబంధించి నిపుణులు ఎవరు ఎలా స్పందించారో ఇప్పుడు తెలుసుకుందాం..

* స్వాగతించే చర్య

విద్యా రంగానికి బడ్జెట్‌ కేటాయింపుపై KLAY సీఈవో ఏకే శ్రీకాంత్ మాట్లాడుతూ.. అన్ని స్థాయిల్లో విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తామనడం స్వాగతించే చర్య. విద్యపై జీఎస్టీ గురించి మాట్లాడకపోవడం నిరాశ కలిగించిందని చెప్పారు.

* సప్త రుషుల్లో లేదు

టైమ్ (T.I.M.E) వ్యవస్థాపకుడు & డైరెక్టర్ మానెక్ దరువాలా మాట్లాడుతూ.. ఈసారి బడ్జెట్‌ను ప్రభుత్వం సప్త రుషి బడ్జెట్‌గా అభివర్ణించింది. ప్రధాన రంగాల్లో ఒకటైన విద్యారంగాన్ని ఇందులో నేరుగా భాగస్వామ్యం చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 సూచించిన వాటికి కూడా తగినంత నిధులు కేటాయించలేదు. దీని బట్టి విద్యావ్యవస్థను విస్మరించినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

* ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం

పిల్లలకు వినూత్నంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం. బడ్జెట్లో ఈ అంశాన్ని చేర్చడం బాగుంది. 5G సేవలతో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఆప్షన్లు అభివృద్ధి చేసేందుకు ఇంజినీరింగ్ కాలేజీల్లో 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామనడం మెచ్చుకోదగ్గ విషయమని KIIT వరల్డ్ స్కూల్ గుర్గావ్ ప్రిన్సిపాల్ నీలిమా కమ్రా పేర్కొన్నారు.

* కాస్త నిరాశ

కొవిడ్ తర్వాత డిటిటల్ ప్లాట్‌ఫారంలో చదువుకునే వారి సంఖ్య పెరుగుతోందని క్లౌడ్థాట్ వ్యవస్థాపకుడు, సీఈవో భవేష్ గోస్వామి అన్నారు. అందుకు అనుగుణంగానే ఎడ్యూటెక్ కంపెనీలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో వీటిపై జీఎస్టీ తగ్గించకపోవడం సబబు కాదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :  విద్యార్థులకు ఫిబ్రవరి నెల కీలకం.. ఈ నెలలో ముఖ్యమైన ఈవెంట్స్‌ ఇవే..

* టెక్నాలజీని అందిపుచ్చుకునేలా చర్యలు

ఏ.ఐ (AI), 5G టెక్నాలజీని అందిపుచ్చుకునేలా కొత్త కోర్సులపై ప్రభుత్వం దృష్టి సారిస్తామనడం బాగుంది. ఈ బడ్జెట్లో పరిశోధన, నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించారు. మేక్‌ AI ఇన్‌ ఇండియా, మేక్‌ AI వర్క్‌ ఫర్‌ ఇండియా కల సాకారం చేసేందుకు మూడు ఎక్సలెన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామనడం హర్షించదగ్గ విషయమని జైపూర్‌లోని JK లక్ష్మీపట్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అశ్విని శర్మ పేర్కొన్నారు.

* ఉన్నత విద్యను విస్మరించారు

గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సీఎఫ్వో వి వైద్యనాథన్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యకు సంబంధించి స్పష్టమైన ప్రకటనలు చేయకపోవడం నిరాశ కలిగించింది. ఉన్నత విద్యారంగంలో పరిశోధనలకు ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. దేశ అభివృద్ధికి, గ్లోబల్ మేనేజర్లను తయారుచేసేందుకు ఈ రంగం ఎంతో కీలకం. ప్రైవేటు సంస్థలకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం ముందుకు వస్తుందని మేము కోరుకుంటున్నామని చెప్పారు.

First published:

Tags: Budget 2023, Career and Courses, EDUCATION, GST, JOBS

ఉత్తమ కథలు